Kalvakuntla Kavitha: నాని నటించిన ది ప్యారడైజ్ సినిమాలో ఎమ్మెల్యే శంకర్రావు పాత్ర అచ్చం సీఎం కేసీఆర్ ను పోలి ఉన్నట్టు ఉంది. ఈ పాత్రలో ప్రియదర్శి నటించారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో సవారిలకు గుర్తింపు తీసుకురావడానికి ఏకంగా ముఖ్యమంత్రినే వారి వద్దకు తీసుకువస్తాడు శంకర్రావు. ఒకరకంగా సవారిల తెగకు ఆరాధ్య నాయకుడిగా మారిపోతాడు.
తెరమీద శంకర్రావు కనిపించినప్పుడు గులాబీ నాయకులు థియేటర్లో ఒకటే హడావిడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ షేర్ కేసీఆర్ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. దీనికి తోడు కొన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్.. శంకర్రావు పాత్రకు విపరీతంగా ఎలివేషన్ ఇస్తున్నాయి. ఇక ఓవర్గం మీడియా మాత్రం ఈ సినిమా మీద నెగిటివ్ ట్రోల్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈరోజు గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చూడబోతున్నారు. తనకు ఎంతో ఇష్టమైన నాని.. దర్శకుడు శ్రీకాంత్.. నటుడు ప్రియదర్శి నటించిన ఈ సినిమా చూడడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ప్రకటించారు.
కేటీఆర్ ప్రకటనకు భిన్నంగా కవిత స్పందించారు. ది ప్యారడైజ్ సినిమాలో కెసిఆర్ను అవమానించారని కవిత వ్యాఖ్యానించారు. ప్యారడైజ్ సినిమా బాగోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. గులాబీ పార్టీ నాయకులు తెరమీద శంకరరావు పాత్ర కనిపించగానే సోషల్ మీడియాలో విపరీతంగా ఎలివేషన్లు ఇస్తున్నారని.. ఆ పార్టీ ప్రజల్లో లేదని.. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఉందని కవిత వ్యాఖ్యానించారు. ఇక వినాయక నిమజ్జనం రోజు చాలామందికి డబ్బులు ఇచ్చి కేసీఆర్ పాటలు పెట్టిస్తున్నారని.. ఆ పాటలకు డ్యాన్సులు వేస్తున్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు.
కవిత ఈ విషయాలను బయట పెట్టడంతో కాంగ్రెస్ నాయకులు దాడి మొదలుపెట్టారు. “ఇప్పటివరకు జనాలు ఊగిపోతున్నారని.. ఈలలు వేస్తున్నారని అనుకున్నాం. కానీ దీని వెనుక గులాబీ పార్టీ నాయకులు ఉన్నారు. డబ్బులు ఇస్తూ డ్యాన్సులు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం కోరుకుంటున్నారు. ఆ పార్టీ ప్రజల్లో లేదు. జస్ట్ సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని కెసిఆర్ కుమార్తె స్వయంగా చెబుతోంది. ఇంతకు మించిన సిగ్గుమాలినతనం మరొకటి ఏమంటుందని” కాంగ్రెస్ పార్టీ నాయకులంటున్నారు. మొత్తానికి కవిత బయటపెట్టిన నిజాలు ప్యారడైజ్ సినిమాలో అసలు విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. మరి కేటీఆర్ ఈ సినిమాను చూసి ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాల్సి ఉంది.
–> ది ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ను అవమానించారు – కవిత
–> ప్యారడైజ్ సినిమా బాగాలేదు.. నేను చూడను – కవిత
–> బీఆర్ఎస్ భవిష్యత్లో సోషల్ మీడియాలోనే ఉంటుంది – కవిత
–> కేసీఆర్ పాటలకు డబ్బులిచ్చి డ్యాన్స్ చేయిస్తున్నారు – కవిత
–> వచ్చే వేసవి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర… pic.twitter.com/hf4OvY4OSJ
— RTV (@RTVnewsnetwork) September 26, 2026