Homeక్రీడలుక్రికెట్‌Womens Asia Cup: మన కడప రెడ్డమ్మ ఉగ్రరూపం.. ఆసియా కప్ దర్జాగా టీమిండియా చేతుల్లోకి..

Womens Asia Cup: మన కడప రెడ్డమ్మ ఉగ్రరూపం.. ఆసియా కప్ దర్జాగా టీమిండియా చేతుల్లోకి..

Womens Asia Cup: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో తెలుగు సంచలనం శ్రీ చరణి సత్తా చాటింది. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. తద్వారా శ్రీలంక జట్టు బెంబేలెత్తిపోయింది. ఫలితంగా ఆసియా కప్ ట్రోఫీ టీం ఇండియా చేతుల్లోకి దర్జాగా వచ్చేసింది. ఫైనల్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమిండియా సమిష్టిగా రాణించింది. తద్వారా ఎనిమిదవ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. దుబాయ్ వెహికల్ గా జరిగిన ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక […]

Womens Asia Cup: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో తెలుగు సంచలనం శ్రీ చరణి సత్తా చాటింది. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. తద్వారా శ్రీలంక జట్టు బెంబేలెత్తిపోయింది. ఫలితంగా ఆసియా కప్ ట్రోఫీ టీం ఇండియా చేతుల్లోకి దర్జాగా వచ్చేసింది.

ఫైనల్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమిండియా సమిష్టిగా రాణించింది. తద్వారా ఎనిమిదవ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. దుబాయ్ వెహికల్ గా జరిగిన ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టుపై భారత ప్లేయర్లు సూపర్ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. ఏకంగా 72 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టి కరిపించారు. భారత ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలీ వర్మ అదరగొట్టారు. వీరిద్దరి విధ్వంసానికి తెలుగుతేజం శ్రీ చరణి(4/20) తోడు కావడంతో.. శ్రీలంక జట్టు ఆశలు అడుగంటి పోయాయి.

ఈ మ్యాచ్లో ముందుగా భారత్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్ల పాటు పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేయగలిగింది. ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 183 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. స్మృతి కేవలం 39 బంతుల్లోనే 59 పరుగులు చేసింది. వర్మ 39 బంతుల్లో 68 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు తరుపున మిథాలి అయోధ్య.. చమరి ఆటపట్టు, చముడి ప్రబోధ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత శ్రీలంక జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది. కేవలం 11 పరులపై కుప్పకూలింది. చమరి 36 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. నీలాక్షిక సిలువ 22 పరుగులు చేసింది. అయితే మిగతా బ్యాటర్లు దారుణ విఫలం కావడంతో శ్రీలంక ఓటమి తప్పలేదు భారత జట్టు బౌలర్లలో శ్రీ చరణి నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంక జట్టు పతనాన్ని శాసించింది. దీపి శర్మ మూడు వికెట్లు దక్కించుకుంది. క్రాంతి గౌడ్.. వర్మ.. ప్రేమ తలా ఒక వికెట్ సొంతం చేసుకున్నారు.

ఈ మ్యాచ్లో టాస్ గెలవడం భారత జట్టుకు అనుకోని వరంలాగా మారింది. ఓపెనర్లు దిమ్మ తిరిగే స్థాయిలో బ్యాటింగ్ చేశారు. ప్రారంభం నుంచే శ్రీలంక బౌలర్ల మీద ఎదురుదాటికి దిగారు. వర్మ.. మందాన నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి పరుగులు చేశారు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి భారత్ ఒక వికెట్ కూడా కోల్పోకుండా 57 పరుగులు చేసింది. వర్మ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. స్మృతి 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. తొలి వికెట్లు టీమ్ ఇండియా 129 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే ఈ జోడిది ప్రబోధ విడదీసింది. ఆ తర్వాత స్మృతి కూడా అవుట్ కావడంతో భారత స్కోర్ వేగం కాస్త మందగించింది. కానీ మిగతా బ్యాటర్లు సత్తా చాటడంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper