Homeహెల్త్‌Monsoon Health Tips: వానాకాలం.. పానీపూరి తింటున్నారా..

Monsoon Health Tips: వానాకాలం.. పానీపూరి తింటున్నారా..

Monsoon Health Tips: ఆలస్యంగా నైనా సరే వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కాకపోయినప్పటికీ.. వర్షాకాలం ని గుర్తు చేస్తూ ఆకాశం జల్లులకు కురిపిస్తోంది. సహజంగానే వర్షాకాలం అంటే చాలామందికి ఇష్టం. సాయంకాలం పూట వేడివేడి బజ్జీలు.. పకోడీలు.. పునుగులు తినడం చాలామందికి ఒక రకమైన అలవాటు. ఇక కాలాలతో సంబంధం లేకుండా పాని పూరి తినడం కూడా చాలామందికి ఆసక్తి. కాలానికి తగ్గట్టుగా ఆహారాలు మారిపోయాయి. వాటి రుచి కూడా మారిపోయింది. కానీ పానీపూరి మాత్రం అలానే […]

Monsoon Health Tips: ఆలస్యంగా నైనా సరే వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కాకపోయినప్పటికీ.. వర్షాకాలం ని గుర్తు చేస్తూ ఆకాశం జల్లులకు కురిపిస్తోంది. సహజంగానే వర్షాకాలం అంటే చాలామందికి ఇష్టం. సాయంకాలం పూట వేడివేడి బజ్జీలు.. పకోడీలు.. పునుగులు తినడం చాలామందికి ఒక రకమైన అలవాటు. ఇక కాలాలతో సంబంధం లేకుండా పాని పూరి తినడం కూడా చాలామందికి ఆసక్తి.

కాలానికి తగ్గట్టుగా ఆహారాలు మారిపోయాయి. వాటి రుచి కూడా మారిపోయింది. కానీ పానీపూరి మాత్రం అలానే ఉండిపోయింది. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికీ పానీ పూరి అంటే రోడ్డు మీద ఉండే బండి.. ఆ బండి మీద పానీపూరీలు తినడం చాలా మందికి ఒక అలవాటు. అయితే పానీపూరి మంచి ఆహారమే అయినప్పటికీ.. దాని తయారు చేసే విధానం చాలా స్వచ్ఛంగా ఉండాలి.

పూరీలను కేవలం గోధుమపిండితో మాత్రమే చేయాలి. ఒకసారి వాడిన నూనెను మరొకసారి ఉపయోగించకూడదు. ఆలుగడ్డలను మెత్తగా ఉడికించాలి. అందులో ప్రమాదకరమైన టేస్టింగ్ సాల్ట్ వంటి వాటిని ఉపయోగించకూడదు. పైగా రసం కోసం స్వచ్ఛమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి. అవసరమైతే ఆ నీటిని వేడి చేసి రసం తయారీకి ఉపయోగించాలి. కానీ చాలామంది వ్యాపారులు ఇలాంటి శుభ్రమైన విధానాలు చేపట్టరు. పానీ పూరి తయారీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. కలుషితమైన నీటిని ఉపయోగిస్తుంటారు.

ఇటువంటి పదార్థాలతో పానీపూరి తయారు చేయడం వల్ల.. వాటిని తిన్న వాళ్లకు రోగాలు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో టైఫాయిడ్.. కలరా వంటి వ్యాధులు సోకడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాన కాలంలో ఈగలు ఎక్కువగా ముసురుతూ ఉంటాయి. శుభ్రత లేని ఆహార పదార్థాలమీద ఎక్కువగా వాలుతూ ఉంటాయి. పానీ పూరి తయారీలో ఆలు.. ఇతర పదార్థాలు వాడుతుంటారు. వాటిమీద ఈగలు ఎక్కువగా వాలిపోతూ ఉంటాయి. అటువంటి పానీపూరి తినడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్లే వానకాలంలో పానీపూరి తినకపోవడమే మంచిది. ఒకవేళ అంతకు తినాలి అనిపిస్తే ఇంట్లో చేసుకొని తినడం చాలా మంచిది. రోడ్ల పక్కన పానీ పూరీ తినకూడదు. శుభ్రంగా సుచిగా ఉన్న చోటమాత్రమే పానీపూరీ తినాలి. ఈగలు ముసిరే చోట, దోమలు వ్యాప్తి చెందే చోట పానీ పూరీ తింటే రోగాలు కొని తెచ్చుకున్నట్టే. పైగా ఈ.కోలై లాంటి బ్యాక్టీరియా కూడా పానీపూరీలలో ఉంటున్నట్టు ఇటీవల తేలింది. అందువల్లే కేవలం వానాకాలమే కాదు, ఏ కాలాల్లో కూడా పానీపూరీ బయట తినకూడదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper