HomeతెలంగాణKalvakuntla Kavitha: లిక్కర్ కేసు నుంచి ఉపశమనం.. కవిత తర్వాతి టార్గెట్ అదే

Kalvakuntla Kavitha: లిక్కర్ కేసు నుంచి ఉపశమనం.. కవిత తర్వాతి టార్గెట్ అదే

Kalvakuntla Kavitha: ఇన్నాళ్లపాటు లిక్కర్ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత మొత్తానికి స్వేచ్ఛను పొందారు. అనేక విమర్శలను తట్టుకొని ఆమె న్యాయస్థానంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ.. ఇతర వ్యవహారాలలో కవిత బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో లిక్కర్ కేసు కొట్టిన తర్వాత కవితలో కొత్త జోష్ వచ్చినట్టు కనిపిస్తోంది. […]

Kalvakuntla Kavitha: ఇన్నాళ్లపాటు లిక్కర్ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత మొత్తానికి స్వేచ్ఛను పొందారు. అనేక విమర్శలను తట్టుకొని ఆమె న్యాయస్థానంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ.. ఇతర వ్యవహారాలలో కవిత బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో

లిక్కర్ కేసు కొట్టిన తర్వాత కవితలో కొత్త జోష్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె రాజకీయాలలో దూకుడు పెంచినట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవల నార్సింగి ప్రాంతంలో కవిత తన అనుచరులతో సమావేశమైనట్టు సమాచారం. అయితే అత్యంత గోప్యంగా ఈ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నర్సింగ్ ప్రాంతంలో ఓ వెంచర్ వద్ద కవిత ధర్నా చేశారు. స్థానికులు ఆమెకు జత కావడంతో అక్కడ ఆందోళన పెరిగింది. దీంతో పోలీసులు వచ్చి కవితను అదుపులోకి తీసుకున్నారు.

కవిత నార్సింగి ప్రాంతంలో ధర్నా చేయడం వెనుక బలమైన కారణం ఉందని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే త్వరలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కవిత ఆందోళన చేసినట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీ పెట్టి.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెరపైకి తీసుకురావాలని కవిత భావిస్తున్నారు. మూసి ఆక్రమణలకు సంబంధించి నార్సింగి ప్రాంతంలో ఆమె ధర్నాకు దిగడం వల్ల స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో అధికారులు కదిలి అక్రమాలను కనిపెట్టే పనిలో పడ్డారు. అయితే నార్సింగ్ ప్రాంతానికే తన ధర్నాను పరిమితం చేయకూడదని.. హైదరాబాద్ నగరం మొత్తం ఈ తరహాలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కవిత అనేక రకాలుగా గులాబీ పార్టీపై విమర్శలు చేశారు. కెటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలు జరిగాయని ఇప్పటికే కవిత ఆరోపించారు. 10 సంవత్సరాల గులాబీ పార్టీ పరిపాలన కాలంలో ఆక్రమణలు.. అక్రమాలు జోరుగా సాగడం వల్లే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు వర్షం వస్తే మునిగిపోతున్నాయని కవిత ఆరోపించారు. ఇదే నేపథ్యంలో కవిత జాగృతి నెట్వర్క్ ను మరింత బలపరిచి.. ప్రజల సమస్యల పరిష్కారానికి కదలాలని సంకల్పించినట్టు తెలుస్తోంది. ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు చేసి.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper