Kavitha New Look: కల్వకుంట్ల కవిత.. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేనిటౌట్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు తర్వాత ఆమె జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే ఈ అరెస్టు.. సుమారు ఆరు నెలల తీహార్ జైలులో ఉండడం.. కవితలో మార్పు తెచ్చింది. ఇక ఆరు నెలల క్రితం బీఆర్‌ఎస్ పార్టీలో ఉంటూ సొంత పార్టీ నేతలపైనే అవినీతి ఆరోపణలు చేశారు. పార్టీలో అంతర్గత పరిస్థితులపై తండ్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. దీంతో ఇది అంతర్గత విభేదాలను బయటపెట్టింది. వెంటనే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి రాజభోగాలు అనుభవించిన కవిత.. అధికారం పోగానే చాలా మారిపోయారు. పదేళ్లు కవిత ఒంటిపై ఆకర్షణీయంగా మెరిసే దుస్తులు, ఆభరణాలు మాత్రమే కనిపించేవి. మ్యాచింగ్ డ్రెస్సులు, ఆభరణాలు ఉండేవి. ఇది కుటుంబ దోపిడీకి నిదర్శనంగా ప్రజల్లో ముద్ర పడింది.
కష్టకాలంలో మొదటి మలుపు
పదేళ్లు అలకరణలు, లగ్జరీ కార్లు, బంగ్లాలతో దొరసానిలా కనిపించిన కవిత ఇప్పుడు చేనేత దుస్తులు ధరిస్తున్నారు. చేతులకు మట్టి గాజులు వేసుకుంటున్నారు. గ్రామీణ సంస్కృతి ప్రతిబింబించే ఆభరణాలు ధరిస్తున్నారు. ఒక చానల్ ఇంటర్వ్యూలో చెప్పిన రూ.25 లక్షల వాచ్ ప్రజల దృష్టిలో బలంగా నాటుకుపోయింది. బీఆర్‌ఎస్ నుంచి బయటపడిన ఆమె ఇప్పుడు తెలంగాణ జాగృతి అభియానంతో ప్రజల్లోకి దూకారు. అయితే, ప్రజలు ఆమెను మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఆల్కహాల్ కేసుల్లో పేర్కొన్న వ్యక్తిగా, కుటుంబ దోపిడీగా చూస్తున్నారు.
జయలలిత శైలి అనుకరణ..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దుస్తులు, జుట్టు శైలిని పోలిన మార్పు కవితలో కనిపిస్తోందని విమర్శకులు చెబుతున్నారు. జయలలిత విడిపోయాక ఆమె బంధువులు కూడా ఇదే శైలి ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రజలు ఆమెను పట్టించుకోలేదు. తాజాగా కవిత పరిస్థితి కూడా జయలలిత కోడలు పరిస్థితే అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు కవిత డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్‌లో మార్పు జనాల మధ్యలో ఏడుపు ఇవన్నీ ప్రజలు ఎలా స్వీకరిస్తారో.. అధికారంలో ఉన్న పదేళ్లు కట్టిన చీర కట్టని కవిత చేనేత రంగాన్ని ప్రోత్సహించని కవిత అధికారం పోగానే ఇప్పుడు చేనేత మంత్రం వల్లిస్తున్నారు. ఇదంతా ప్రజలను మళ్లీ మోసం చేయడానికే అని, అధికార దాహంతోనే అని పేర్కొంటున్నారు.
View this post on Instagram