HomeతెలంగాణKavitha political statement: నేనైతే మంచిదాన్ని కాదు.. ఆంధ్రోళ్లను హెచ్చరించిన కవిత

Kavitha political statement: నేనైతే మంచిదాన్ని కాదు.. ఆంధ్రోళ్లను హెచ్చరించిన కవిత

Kavitha political statement: తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సేన వ్యవస్థాపకురాలు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ కల్వకుంట్ల కవిత మరోసారి హీట్‌ పెంచారు. హైదరాబాద్‌లో ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏజెంట్‌ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడంతో ఇది జరుగుతుందన్నారు. ‘నేనైతే మంచిదాన్ని కాదు’ అంటూ పాత నాయకులను ప్రస్తావిస్తూ, విగ్రహాల సంస్కృతిని తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఆ విగ్రహాలను తొలగించి […]

Kavitha political statement: తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సేన వ్యవస్థాపకురాలు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ కల్వకుంట్ల కవిత మరోసారి హీట్‌ పెంచారు. హైదరాబాద్‌లో ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏజెంట్‌ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడంతో ఇది జరుగుతుందన్నారు. ‘నేనైతే మంచిదాన్ని కాదు’ అంటూ పాత నాయకులను ప్రస్తావిస్తూ, విగ్రహాల సంస్కృతిని తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఆ విగ్రహాలను తొలగించి ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తామని స్పష్టం చేశారు.

రావొచ్చు.. పోవచ్చు..
ఆంధ్రా నాయకులు, వ్యాపారాలు తెలంగాణకు రావచ్చు పోవచ్చన్నారు. ఇక్కడ కంపెనీలు పెట్టి స్థానిక యువతకు ఉపాధి కల్పించవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రావాళ్లు తెలంగాణలో రొయ్యలు అమ్ముకోవచ్చని, షూటింగ్‌లు చేసుకోవచ్చని, సినిమాలు తీసుకోవచ్చాన్నారు. వ్యాపారులకు అయితే రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతం పలుకుతామని తెలిపారు. కానీ తెలంగాణ సెక్రెటేరియట్‌లో ఆంధ్రవాళ్లు గరిట తిప్పే ప్రయత్నం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

విగ్రహాల సంస్కృతి మీద దాడి
కవిత ప్రధాన టార్గెట్‌ విగ్రహాల నిర్మాణం. తాను ‘‘పాత నాయకులంత మంచిదాన్ని కాదు’’ అని చెప్పడం ద్వారా కొత్త తరం రాజకీయాలు, ప్రాక్టికల్‌ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని సంకేతం. ప్రాంతీయ సంబంధాలుకవిత రెండు ముఖ్యమైన పాయింట్లు చెప్పారు. విదేశీయుల కంటే భారతీయ (తెలుగు) వ్యాపారులను ఆహ్వానించి, భూములు ఇచ్చి పరిశ్రమలు స్థాపించాలని. ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన శ్రీసిటీ నిర్మాతను తెలంగాణకు ఆహ్వానించడం ద్వారా ప్రాంతీయ సంబంధాలను మెరుగుపరచాలని సంకేతం.

రాజకీయ ప్రభావం ఏమిటి?
విగ్రహాలకు బదులు ఉపాధి, వాణిజ్యం, సినిమా పరిశ్రమకు ప్రాధాన్యం – యువత, వ్యాపారులలో ఆకర్షణీయం కావచ్చు. అయితే కవిత ఆంధ్ర–తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు పెంచే హెచ్చరికలు చేశారు. ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నంలా కవిత మాటలు ఉన్నాయి.

కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హల్‌చల్‌ సృష్టించాయి. ఆంధ్ర–తెలంగాణ సంబంధాలు వంటి సున్నితమైన అంశాలను ఒకేసారి తాకాయి. ఇవి కేవలం హెచ్చరికలు మాత్రమేనా లేదా భవిష్యత్‌ రాజకీయ వ్యూహాల భాగమా అనేది కాలమే చెప్పాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper