Kavitha: శాసనమండలిలో మొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావోద్వేగంతో మాట్లాడింది కదా.. తమ కుటుంబ దైవం లక్ష్మీనరసింహస్వామి, తన ఇద్దరు కొడుకుల పై ఒట్టు వేసి.. తనది ఆస్తికోసం పోరాటం కాదని.. ఆత్మగౌరవం కోసం పోరాటమని చెప్పింది కదా.. పదేళ్లలో ఏం పీకి కట్టలు కట్టిన మని జాతీయస్థాయికి పోయినమని.. తన తండ్రి పరిపాలనను ఉద్దేశించి విమర్శించింది కదా.. ఇక ఎప్పుడైతే కవిత ఆ మాటలు మాట్లాడిందో.. అప్పటినుంచి కేటీఆర్ కాంపౌండ్ లో పనిచేసే వ్యక్తులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు.
సోషల్ మీడియాలో కవితను ఉద్దేశించి పిచ్చిపిచ్చిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఆమె ఉంటే ఎంత.. చస్తే ఎంత అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఇటీవల కాలంలో కవిత మీద కాంగ్రెస్ పార్టీ కంటే, కాషాయం పార్టీ కంటే గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియానే యుద్ధం చేస్తోంది. కవిత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతోంది. ఇక కిరాయి యూట్యూబ్ ఛానల్స్ అయితే పిచ్చిపిచ్చిగా వార్తలను ప్రసారం చేస్తున్నాయి. కెసిఆర్ లాంటి మహానుభావుడి కడుపులో కవిత అనవసరంగా పుట్టిందని.. ఇప్పుడు తండ్రికి తలంపులు తెచ్చే దుర్మార్గానికి శ్రీకారం చుట్టిందని ఆరోపిస్తున్నారు. చెత్త అని, చెదలు అని, కేసుల మాఫీ కోసం కాంగ్రెస్ పార్టీ, బిజెపి నాయకులతో చేయి కలిపిందని ఆరోపిస్తున్నారు.
త్వరలో కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందని.. ఇప్పటికే రేవంత్ రెడ్డి తో మంతనాలు జరిపిందని.. అందువల్లే భారత రాష్ట్ర సమితి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోందని.. కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక మిగతా నాయకులైతే కవితను దారుణంగా తిడుతున్నారు. సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో కవితను ప్రశ్నిస్తూ గులాబీ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారంటే వారు ఏ స్థాయిలో అసహనంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కవిత లేవనెత్తుతున్నది తనకు జరిగిన అన్యాయం పైన.. తనది ఆస్తుల కోసం పోరాటం కాదని చెబుతూనే ఉంది. అలాంటప్పుడు కేటీఆర్ అనుకూల వ్యక్తులు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఏంటి. కవిత సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అయితే కేసీఆర్ లేకుంటే కేటీఆర్ మీద ఉంటుంది. మధ్యలో ఈ కిరాయి యూట్యూబర్లకు ఏం అవసరం. ఈరోజు బిస్కెట్లు పడేస్తున్నారు కాబట్టి కుక్కల మాదిరిగా తోకలు ఊపుతారు. ఆ తదుపరి ఏం చేస్తారని కవిత వర్గం నాయకులు ప్రశ్నిస్తున్నారు.
కవిత కూడా తన సోషల్ మీడియాను బలోపేతం చేసింది. ట్విట్టర్లో కవితక్క అప్డేట్స్ పేరుతో ఒక ఎకౌంటు ఓపెన్ అయింది. అందులో ప్రధానంగా సంతోష్ రావు చేసిన అక్రమాలు.. హరీష్ రావు చేసిన దుర్మార్గాలు ప్రస్తావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో 10 సంవత్సరాలలో తెలంగాణలో ఏం జరిగింది.. ఏ పథకంలో ఎంత నొక్కారు.. అనే విషయాలను కవితక్క అప్డేట్స్ అనే అకౌంట్ ద్వారా బయటపెడుతున్నారు. దీంతో గులాబీ పార్టీకి. ఆ పార్టీ అనుకూల కిరాయి సోషల్ మీడియాకు బలమైన సమాధానం చెబుతున్నారు. త్వరలో కవిత రాజకీయ పార్టీ పెడుతుంది కాబట్టి.. అది కూడా లాంచనమే కాబట్టి.. కవితక్క వర్సెస్ గులాబీ పార్టీ అన్నట్టుగా పొలిటికల్ వ్యవహారం సాగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.