Naga Chaitanya accident scare video: అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కి తృటిలో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆయన హీరో గా నటించిన ‘వృష కర్మ'(Vrusha Karma) చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని నేడు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ ని ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో స్టేజిలో పై ఆయన కూర్చున్న కుర్చీ అకస్మాత్తుగా వెనక్కి విరిగిపోవడం తో ఆయన క్రింద పడిపోయాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే నాగ చైతన్య ని పైకి లేపడం తో ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో నాగ చైతన్య కి ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఆయన అలా పడిపోవడం చూసి అభిమానులు కంగారు పడ్డారు. పెద్ద ఎత్తున అరిచారు, నాగ చైతన్య తనకు ఏమి కాలేదని సైగలు చేసి చెప్పడంతో కాస్త శాంతించారు.
సోషల్ మీడియా లో సంచలనం గా మారిన ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేస్తున్నప్పుడు అన్నీ సరిగా ఉన్నాయో, లేవో చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులది . కనీసం కుర్చీలు బాగున్నాయో లేవో కూడా చూసుకునే బాధ్యత లేదు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు ఏంటి అంటూ సోషల్ మీడియా లో అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏమి కాలేదు కాబట్టి సరిపోయింది, పొరపాటున ఏమైనా జరుగుంటే ఏంటి పరిస్థితి ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య మంచోడు కాబట్టి, ఆయన ఎలాంటి కోపం చూపించలేదు. అదే వేరే హీరో అయ్యుంటే రియాక్షన్ వేరేలా ఉండేదేమో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘వృష కర్మ ‘ మూవీ విశేషాల్లోకి వస్తే , ఈ చిత్రానికి కార్తీక్ డందు దర్శకత్వం వహించాడు.
Also Read: రామ్ చరణ్ కోసం రాసుకున్న కథను అల్లు అర్జున్ లాక్కున్నాడా..?
గతం లో ఈయన తెరకెక్కించిన ‘విరూపాక్ష’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ హారర్ థ్రిల్లర్ జానర్ మూవీస్ లో ఇదొక్కటి. థియేటర్స్ లో ఆడియన్స్ కి ఈ సినిమా ఇచ్చిన అనుభూతే వేరు. అలాంటి సినిమా తర్వాత ఆయన తీస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై మొదటి నుండి ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ ఉంది. నేడు విడుదల చేసిన టీజర్ తో ఆ బజ్ తారా స్థాయికి చేరుకుంది. నాగ చైతన్య సరైన సినిమాతో ఈసారి మన ముందుకు రాబోతున్నాడు, కచ్చితంగా ఇది వంద కోట్ల గ్రాస్ ని రాబడుతుందని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి ఆ రేంజ్ కి చేరుకుంటుందో లేదో చూడాలి.
నాగచైతన్యకు తప్పిన ప్రమాదం..
హైదరాబాద్ ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో జరిగిన ‘వృషకర్మ’ ఈవెంట్లో హీరో నాగచైతన్యకు ప్రమాదం తప్పింది. స్టేజీపై ఆయన కూర్చున్న కుర్చీ అకస్మాత్తుగా వెనక్కి విరిగిపోగా, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పట్టుకోవడంతో గాయాలు కాలేదు. ఈ ఘటనతో కంగారుపడిన అభిమానులను చూసి,… pic.twitter.com/nSQXYsTFx7
— ChotaNews App (@ChotaNewsApp) March 5, 2026