Kalvakuntla Kavitha: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం అజారుద్దీన్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాదు. మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లో ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ కావాలి. లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత కూడా పోటీకి సిద్ధమవుతోంది. కవిత రాజీనామాను గుత్తాసుఖేందర్‌రెడ్డి ఆమోదించారు. కవిత స్థానం ఖాళీ కావడంతో, త్వరలోనే భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తమ అభ్యర్థిని ఎంపిక చేసుకునేందుకు సంస్థాగత చర్యలు పూర్తి చేసినట్లు సమాచారం.
అజరుద్దీన్‌కు అవకాశం..
ఖాళీ అయిన కవిత స్థానాన్ని మాజీ క్రికెటర్ అజరుద్దీన్‌కు ఈ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ, పరిస్థితుల వల్ల మంత్రి పదవి ఇచ్చి మచ్చిక చేసుకున్నారు. రెండు సభల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో, నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఏ సభలోనైనా సీటు సాధించాల్సి ఉంది.
గెలుపు అంత ఈజీనా?
కవిత 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైంది, ఇది ప్రత్యక్ష ఎన్నికే. ఇప్పుడు కూడా అదే విధానం పాటించాల్సి వచ్చింది. కానీ, నిజామాబాద్ ఎంపీ స్థానం బీజేపీ వద్ద ఉండటం, స్థానికంగా బీఆర్‌ఎస్ బలోపేతం కారణంగా కాంగ్రెస్‌కు సవాలు. అజరుద్దీన్ మండలిలోకి ప్రవేశించి విజయం సాధించగలరా అనేది ఆసక్తికరంగా చూడాలి.