Heartbreaking Video: విజయ్ మాల్యా వందల కోట్లకు బ్యాంకులను ముంచి వెళ్ళిపోతాడు. అటువంటి ఆర్థిక మోసగాడిని దేశానికి తీసుకురాలేక.. అతడి ఆస్తులను స్వాధీనం చేసుకోలేక మన వ్యవస్థలు చూస్తూ ఉండిపోతాయి.
ఆర్థిక మోసగాళ్లు.. అక్రమార్కులు.. దుర్మార్గులు.. దోపిడీదారులు.. మోసగాళ్లు.. వంటి వారు మన దేశాన్ని నిండా ముంచుతూనే ఉంటారు. వ్యవస్థలను నాశనం చేస్తూనే ఉంటారు. వారికి నిబంధనలు అడ్డురారు. ప్రభుత్వ వ్యవస్థలు వారిని ఏమీ చేయలేవు. పోలీసులు.. చట్టాలు వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టలేవు. కానీ పేదల విషయంలో మాత్రం మన దేశంలో అన్ని వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తుంటాయి. వారి విషయంలో చట్టాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి.
దేశ రాజధాని ఢిల్లీలో జానకిపురి అనే ఏరియాలో ఓ వీధి వ్యాపారి రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజు అతడు రెండు గంటలు మాత్రమే అక్కడ వ్యాపారం సాగిస్తూ ఉంటాడు. ఆ రెండు గంటలు అతనికి అత్యంత కీలకము. అతని వల్ల ట్రాఫిక్ జామ్ కావడం లేదు. రోడ్లు ఆక్రమణకు గురి కావడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా జనాలకు ఇబ్బంది ఎదుర్కోవడం లేదు. కానీ ఇది అక్కడి పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. ఇంకేముంది పోలీసులు అతని మీద ఇష్టానుసారంగా వ్యవహరించారు. అతడు ఏర్పాటు చేసుకున్న ఫుడ్ స్టాల్ మొత్తాన్ని తొలగించారు. అతడు కన్నీరు పెట్టుకుంటున్నప్పటికీ వారిలో కనికరం కలగలేదు. సార్ నేను రెండు గంటలు మాత్రమే ఇక్కడ ఉంటాను. ఆ రెండు గంటలు మాత్రమే నాకు అత్యంత కీలకము. డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఇక్కడ నేను పనిచేస్తున్నాను సార్ అంటూ వెక్కివెక్కి ఏడ్చాడు.
అతడు ఈ స్థాయిలో ఇబ్బంది పడుతున్నప్పటికీ.. కన్నీరు పెట్టుకొని కలత చెందుతున్నప్పటికీ ఆ ఢిల్లీ పోలీసులు ఏ మాత్రం కనికరం చూపించలేదు. పైగా అతడి మీద మరింత కర్కషత్వాన్ని ప్రదర్శించారు. ఒక వీధి వ్యాపారి మీద తమ పవర్ మొత్తం ఉపయోగించారు. చివరికి అతడి జీవితాన్ని.. జీవనాన్ని మొత్తం ధ్వంసం చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. చాలామంది ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. సామాన్యుల మీద ప్రతాపం చూపించే ఢిల్లీ పోలీసులు.. పెద్ద పెద్ద వ్యక్తుల మీద.. బడా బాబుల మీద చూపించగలరా అంటూ నెటిజన్లు ఢిల్లీ పోలీసులను నేరుగా ప్రశ్నిస్తున్నారు.
A viral video from Delhi’s Janakpuri shows a roadside vendor breaking down after his cart was allegedly overturned during an anti-encroachment drive.
The incident has sparked debate over balancing law enforcement with compassion for daily-wage earners.#Delhi #Janakpuri pic.twitter.com/37zTcchHS0
— The Friction (@thefriction_in) August 5, 2026