Homeఆధ్యాత్మికంGanesh Immersion: గణేష్ నిమజ్జనంలో.. పోలీసులు ఇలా చేస్తారని ఊహించలేదు.. వైరల్ వీడియో

Ganesh Immersion: గణేష్ నిమజ్జనంలో.. పోలీసులు ఇలా చేస్తారని ఊహించలేదు.. వైరల్ వీడియో

Ganesh Immersion: గణేష్ నిమజ్జన వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేయడంతో ట్యాంక్ బండ్ ప్రాంతం కోలాహలంగా మారింది. ఖైరతాబాద్ మహాగణపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఉదయం 6 గంటలకు మొదలైన శోభాయాత్ర మధ్యాహ్నం ముగిసింది. ఆ తర్వాత భారీ క్రేన్ల ద్వారా గణపతిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. గణపతి నిమజ్జనం వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరుగుతాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల కురిసిన […]

Ganesh Immersion: గణేష్ నిమజ్జన వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేయడంతో ట్యాంక్ బండ్ ప్రాంతం కోలాహలంగా మారింది. ఖైరతాబాద్ మహాగణపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఉదయం 6 గంటలకు మొదలైన శోభాయాత్ర మధ్యాహ్నం ముగిసింది. ఆ తర్వాత భారీ క్రేన్ల ద్వారా గణపతిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు.

గణపతి నిమజ్జనం వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరుగుతాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో హుస్సేన్ సాగర్ నీటితో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో గణపతి విగ్రహాలను అందులో నిమజ్జనం చేయడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అందువల్లే హుస్సేన్ సాగర్ వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేసి.. గణపతి నిమజ్జన వేడుకలు జరుపుతున్నారు.

గణపతి నిమజ్జన వేడుకలకు సంబంధించి పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయేదాకా పోలీసులు విధుల్లో ఉంటున్నారు. వాస్తవానికి ఎవరైనా సరే ఒక పనిని అదే పనిగా చేస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పోలీసులు మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జన వేడుకలు నిర్వహించే ట్యాంకు బండ్ ప్రాంతంలో పోలీసులు స్టెప్పులు వేశారు. తీన్మార్ శబ్దాలకు తగ్గట్టుగా కాళ్ళను కదిపారు.

పోలీసులకు విధి అంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఎన్నో నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. బందోబస్తు విధులలో ఉన్న పోలీసులకు నిత్యం ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో ఇలా డాన్సులు వేసి పోలీసులు తమ మీద ఉన్న ఒత్తిడిని తగ్గించుకుంటారు. గతంలో పండుగల సందర్భంలో డిజిపి సివి ఆనంద్.. ఇంకా పోలీసు ఉన్నత అధికారులు స్టెప్పులు వేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇప్పుడు కూడా పోలీసులు ట్యాంక్ బండ్ ప్రాంతం వద్ద చేసిన డ్యాన్సుల వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

పోలీసులు చేస్తున్న డ్యాన్సులు ఒక ఊపు తెప్పిస్తున్నాయి. పెద్ద పెద్ద అధికారులు కూడా నిమజ్జన వేడుకల్లో సందడి చేస్తున్నారు. సిబ్బందితో కలిసి డ్యాన్సులు వేస్తున్నారు. అటు బందోబస్తు నిర్వహిస్తూనే.. ఇటు తమ మీద ఉన్న ఒత్తిడి తగ్గించుకోవడానికి డ్యాన్సులు వేస్తున్నారు. తద్వారా పోలీసులు అంటే కఠినంగా ఉంటారని అనే అపోహను ప్రజల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ పోలీసులు చేసిన డాన్సులు ప్రజలలో ఉత్సాహాన్ని తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper