Sudigali Sudheer: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శివారెడ్డి.మిమిక్రీ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన స్టేజ్ షోస్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. పలు సినిమాల్లో కూడా ఆయన కమెడియన్ గా చేసాడు. అయితే ఎందుకో ఈయనకు సినిమాల్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు అనే చెప్పాలి. కొన్ని సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించే అవకాశాలు వచ్చాయి. కానీ ఇండస్ట్రీ లో జరిగే రాజకీయాల కారణంగానో, లేదా మరేదైనా కారణం వల్లనో తెలియదు కానీ సినిమాల్లో రాణించలేకపోయాడు. కానీ ఇప్పటికీ ఆయన ఈవెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఆ రంగం లో ఈయనకు ఇప్పటికీ తిరుగులేదు. మిమిక్రీ అంటే ఇప్పటికీ, ఎప్పటికీ మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు శివా రెడ్డి మాత్రమే, అందులో ఎలాంటి సందేహం లేదు.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లో ప్రతీ ఒక్కరు నా ఇల్లు చాలా అందంగా ఉంటుందని ప్రత్యేకించి చెప్తుంటారు. అలా ఎందుకు చెప్తారో , నన్నే ఎందుకు టార్గెట్ చేస్తారో అర్థం కాదు. గతం లో నా ఇంటిని సుడిగాలి సుధీర్ కొనుగోలు చేశాడు. సాధారణంగా నేను ఇంటీరియర్ డిజైన్స్ ని అద్భుతంగా చేయిస్తుంటాను. ఆ ఇంటికి మంచి ఇంటీరియర్ డిజైన్ ఉంది. అది సుధీర్ కి చాలా నచ్చింది. అతని ఇష్టానికి తగ్గట్టు ఆ ఇల్లు ఉండడం తో కొనుగోలు చేశాడు, కానీ ఇప్పుడు అతనికి మూడు సొంత ఇల్లులు ఉన్నాయి, అవి నా ఇంటికంటే ఎంతో బాగుంటుంది. కానీ దాని గురించి ఎవ్వరూ చెప్పారు ‘ అంటూ చెప్పుకొచ్చాడు శివా రెడ్డి.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘చిత్రం శ్రీను వద్ద అసిస్టెంట్ గా పని చేసిన వేణు కూడా ఒక నాలుగంతస్తుల ఇంటిని కట్టాడు. ఇది బలగం సినిమాకు ముందు జరిగిన సంఘటన. అతని గురించి ఎవరైనా మాట్లాడారా?, ఎందుకు నన్నే ప్రతీసారి టార్గెట్ చేస్తారు?, వీళ్ళు చేసిన ఈ ప్రచారం వల్ల , శివా రెడ్డి మంచి స్థాయిలో ఉన్నాడు, మన సినిమాల్లో ఎందుకు చేస్తాడు లే అనే ఉద్దేశ్యం తో చాలా మంది నిర్మాతలు నన్ను తీసుకోలేదు’ అంటూ శివ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే అవకాశాలు రాని రోజు ఎలాంటి బాధ పడలేదని, జీరో నుండి మొదలైన నేను, కోట్లాది మంది అభిమానాన్ని పొందే స్థాయికి ఎదిగానని, జీవితానికి ఇంతకు మించిన అదృష్టం మరొకటి ఉంటుందా అంటూ ఆయన కామెంట్స్ చేసాడు.