Motorola Edge 70 Neo: స్మార్ట్ ఫోన్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో వరుసగా కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మోటరోలా తన Edge 70 Neo స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకొస్తుండగా.. సాంసంగ్ తదుపరి ఫ్లాగ్ షిప్ సిరీస్ Galaxy S27 గురించి ఇంట్రెస్టింగ్ లీకులు బయటికి వస్తున్నాయి. మరోవైపు One UI 9.5 update తో సాంసంగ్ ఫోన్ల లో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి..GPT 6.2 Astra పేరుతో విడుదలయ్యే ఏఐ మోడల్ వెనుక అసలు విషయం ఏంటి.. ఈ నాలుగు అప్డేట్స్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో చర్చకు దారితీస్తున్నాయి.
Motorola edge 70 Neo
మోటోరోలా కంపెనీ ఎడ్జ్ 70 సిరీస్లో మరో కొత్త ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకొస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 70 నియో మోడల్ ఫోన్ ను ఈనెల 24న భారతదేశంలో అధికారికంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే కంపెనీ తన వెబ్సైట్లో ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలను బయటపెట్టింది. ఈ ఫోన్లో ముఖ్యమైన ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే డిస్ ప్లే 6.8 అంగుళాలు. 1.5 K AMOLED display.. రీ ప్రెష్ రేట్ 144 HZ.. ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 3.. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్ వై టీ ఐ 710 ఓఐఎస్. సెల్ఫీ కెమెరా 32 మెగా ఫిక్సల్.. బ్యాటరీ 7000 ఎంఏహెచ్.. చార్జింగ్ 45 W ఫాస్ట్ ఛార్జింగ్.. ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 16.. అంతేకాదు ఐపి 64 వాటర్ రెసిస్టెన్స్.. MIL – STD – 810 H మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ ఉన్నాయి. నాలుగు పాంటోన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ధర విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
Samsung galaxy s27
శాంసంగ్ తదుపరి ఫ్లాక్ షిప్ స్మార్ట్ఫోన్ సిరీస్ గెలాక్సీ ఎస్ 27 గురించి ఇప్పటికే లీకులు బయటకు వచ్చాయి. తాజాగా గెలాక్సీ s27 ఆల్ట్రా.. ఎస్ 27 ప్రో.. ఎస్ 27 ప్లస్ మోడల్స్ కు సంబంధించి డమ్మీ యూనిట్ల ఫోటోలు బయటికి వచ్చాయి. ఇందులో ఆల్ట్రా మోడల్ వెనుక కెమెరా డిజైన్ లో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నాయి. ఎస్ 27 అల్ట్రా. ప్రో మోడల్ ఫోన్లలో వెనుక కెమెరాల కోసం అడ్డంగా ఉండే మాడ్యూల్ ఉండవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఎస్ 27 ప్లస్ మాత్రం ప్రస్తుతం డిజైన్ కు దగ్గరగా ఉంది. కెమెరాల విషయానికి వస్తే ఆల్ట్రా మోడల్ లో 200 మెగా ఫిక్సల్ మెయిన్ కెమెరా.. 50 మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ కెమెరా.. టెలిఫోటో కెమెరా ఉండవచ్చని తెలుస్తోంది. కొత్త ప్రాసెసర్.. మెరుగైన కెమెరా పని తీరు వంటి అప్ గ్రేడ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
One UI 9.5.. సాంసంగ్ ఫోన్ లో కొత్త ఫీచర్ల సందడి
సాంసంగ్ యూజర్లకు మరియు ఆసక్తికరమైన అప్డేట్. One UI 9.5 ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందిన ఈ కొత్త వెర్షన్ లో డిజైన్ తో పాటు ప్రైవసీ.. కెమెరా.. మల్టీ టాస్కింగ్ ఫ్యూచర్లలో మార్పులు వస్తున్నాయి. గెలాక్సీ ఎస్ 26 సిరీస్ కోసం బీటా ప్రోగ్రాం కూడా విడుదలైంది. ఈ అప్డేట్ లో కొత్త ట్రాన్స్పరెంట్ డిజైన్.. యాప్ లాక్.. కెమెరా అప్గ్రేడ్.. సాంసంగ్ డెక్స్.. డిజిటల్ విల్ బీయింగ్.. క్విక్ షేర్ వంటి అప్డేట్స్ కనిపిస్తున్నాయి.
జీపీ2 6.2 ఆస్ట్రా..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓపెన్ ఏఐ మరో కీలక అప్డేట్ తీసుకొచ్చింది. జిపిటి 6.2 ఆస్ట్రా, జిపిటి 6.2 ఎస్ఓఐ మోడల్స్ ను నవంబర్ 17న ప్రకటించింది. సంక్లిష్టమైన పనులు.. కోడింగ్.. పరిశోధన.. ప్రొఫెషనల్ వర్క్ ల కోసం ఆస్ట్రాను రూపొందించారు. క్లిష్టమైన సమస్యలను విశ్లేషించడం.. పరిష్కరించే సామర్థ్యం.. సాఫ్ట్వేర్ కోడింగ్.. కోడ్ రివ్యూ పనుల్లో మెరుగైన పనితీరు.. పలు దశలను కూడిన ప్రొఫెషనల్ పనులు నిర్వహించే సామర్థ్యం.. మునిపటి మోడల్స్ తో పోలిస్తే తక్కువ అవుట్ ఫుట్ టోకెన్లతో పనులు పూర్తి చేయడం.. టెక్స్ట్ తో పాటు ఇమేజ్ ఇన్పుట్లను కూడా అర్థం చేసుకోవడం దీని ప్రత్యేకత.. ఇక జిపిటి 6.2 ఎస్ఓఐ విషయానికి వస్తే వేగం.. తక్కువ ఖర్చుతో రోజువారి పనులు నిర్వహించేందుకు రూపొందించారు. ఈ రెండు నమూనాలను ఓపెన్ ఏఐ ఏపీఐ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. చాట్ జిపిటి వర్క్.. కోడెక్స్ వంటి వర్క్ ఫ్లో ల్లో కూడా కొత్త మోడల్స్ వినియోగానికి సంబంధించి అప్డేట్స్ ప్రకటించింది.
మోటరోలా నుంచి భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్ ఫోన్.. సాంసంగ్ నుంచి తదుపరి ఫ్లాగ్ షిప్ సిరీస్ పై ఆసక్తికరమైన లీకులు.. వన్ యు ఐలో కొత్త ఫీచర్లు.. ఓపెన్ ఏఐ నుంచి మరింత శక్తివంతమైన ఏఐ మోడల్స్.. ఇలా టెక్నాలజీ రంగంలో వరుస అప్డేట్స్ వినియోగదారుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ మార్పులు స్మార్ట్ఫోన్.. ఏ ఐ వినియోగాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్తాయో చూడాల్సి ఉంది.