KCR: ఒక విషయం చెప్పుకునే కంటే ముందు.. గతాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండగట్టు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వారు చనిపోయారు. అందులో ప్రయాణిస్తున్న వారంతా తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. వారంతా కూడా కెసిఆర్ కు ఓటు వేసిన వారే. కానివారిని పరామర్శించడానికి కేసీఆర్ కు టైం దొరకలేదు. అసలు అప్పుడు ఆయన ప్రగతిభవన్ నుంచి అడుగు కూడా బయట పెట్టలేదు. మొన్నటిదాకా కూడా చనిపోయిన వారికి.. గాయపడిన వారికి పరిహారం అందలేదు. ఇది కేసీఆర్ మార్కు పరిపాలన.
కానీ ఇదే కేసీఆర్ ఏమంటాడంటే.. చంద్రబాబు డర్టీ పొలిటిషన్.. ఢిల్లీలో చక్రాలు తిప్పుతాడా.. బట్లర్ ఇంగ్లీష్ తో అయితదా.. రెండు వచనాలు ఇంగ్లీషులో మాట్లాడతాడా.. అప్పట్లో జగన్ అండ చూసుకొని.. కెసిఆర్ రెచ్చిపోయేవారు. పైగా సమయం దొరికితే చాలు చంద్రబాబును ఏదో ఒక విషయంలో తిట్టి తన కసి తీర్చుకునేవారు. పైగా ఆపట్లో తాను దేశానికి కాబోయే నాయకుడిని.. ప్రతిపక్షాలకు మొత్తం ఫండింగ్ చేస్తానని కేసీఆర్ గట్టిగానే శపథాలు చేశారు. సొంత మీడియాలో విపరీతంగా రాసుకునేవారు. కానీ ఆ తర్వాతే ఏమైంది.. కూసాలు విరిగిపోయాయి. ఢిల్లీలో చక్రాలు కాదు కదా.. సొంత రాష్ట్రంలో సున్నా ఎంపీ స్థానాలు వచ్చాయి. వాస్తవం ఇలా ఉన్నప్పటికీ.. తనకు ఓటు వేయలేని తెలంగాణ ప్రజలు ద్రోహులు అన్నట్టుగా కేసీఆర్ పదేపదే మాట్లాడుతుంటారు.
ఇప్పుడు రియాల్టీ లోకి వద్దాం.. కెసిఆర్ చంద్రబాబు విషయంలో చేసిన తప్పును కేటీఆర్ దిద్దుకున్నట్టు కనిపిస్తోంది. కరువు కాలంలో కూడా ఏపీకి గోదావరి నీరు తీసుకెళ్లారని.. పట్టిసీమ ద్వారా పంపింగ్ చేశారని.. తద్వారా ఏపీ రాష్ట్రానికి కరువు అనేది తగ్గిపోయిందని స్వయంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక మరో ఎంపీ.. బిజెపి నాయకుడు ధర్మపురి అరవింద్ తుఫాన్ సమయంలో చంద్రబాబు వ్యవహరించే తీరును సరికొత్తగా ఆవిష్కరించారు. ఆయన క్రైసిస్ సమయంలో సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు. కేటీఆర్ నుంచి మొదలు పెడితే అరవింద్ వరకు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు. అది కూడా పాజిటివ్ గా.. ఒకప్పుడు కేసీఆర్ ఎలా మాట్లాడారు.. ఇప్పుడు కేటీఆర్ ఎలా మాట్లాడుతున్నారు.. ఇది చాలు చంద్రబాబు అంటే ఏంటో చెప్పడానికి.. ఇలాంటి సమయంలోనే అప్పట్లో రజినీకాంత్ మాట్లాడిన డైలాగ్ ఒకటి గుర్తుకొస్తుంది.. కాకపోతే దానిని అర్థమైందా రాజా అనే పదంతో మాత్రం ముగించగలుగుతాం.