Homeబిజినెస్Motorola Razr Flex: Samsung galaxy Z fold 8 కు చెక్ పెట్టబోతోందా? Razr...

Motorola Razr Flex: Samsung galaxy Z fold 8 కు చెక్ పెట్టబోతోందా? Razr Flex రాకతో కొత్త పోటీ..

Motorola Razr Flex: ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఇప్పటివరకు శాంసంగ్ కు తిరుగులేదు. ముఖ్యంగా galaxy Z fold సిరీస్ ద్వారా ఇవి భాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు మోటరోలా నుంచి పోటీ వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మోటరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీంతో గెలాక్సీకి సవాల్ విసిరపోతోందా అనే చర్చ మొదలైంది. Motorola Razr Flex ఫోన్ కు సంబంధించిన లీకైన వివరాలు టెక్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతున్నాయి. […]

Motorola Razr Flex: ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఇప్పటివరకు శాంసంగ్ కు తిరుగులేదు. ముఖ్యంగా galaxy Z fold సిరీస్ ద్వారా ఇవి భాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు మోటరోలా నుంచి పోటీ వస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మోటరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీంతో గెలాక్సీకి సవాల్ విసిరపోతోందా అనే చర్చ మొదలైంది. Motorola Razr Flex ఫోన్ కు సంబంధించిన లీకైన వివరాలు టెక్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు Samsung galaxy Z fold 8 కు పోటీ పడడం ఖాయమని తెలుస్తోంది.

మోటోరోలా Razr Flex ప్రత్యేకతలు ఏంటంటే..

మోటరోలా Razr Flex ను పాస్పోర్ట్ తరహా డిజైన్ తో తీసుకొస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా పుస్తకం మాదిరిగా తీర్చుకునే ఫోల్డబుల్ ఫోన్లకు భిన్నంగా.. వెడల్పుగా ఉండే డిజైన్ ఇందులో కనిపించబోతోంది. లీక్ అయిన వివరాల ప్రకారం బయటి డిస్ ప్లే 4.97 అంగుళాలు.. లోపలి డిస్ ప్లే 6.9 టు అంగుళాలు.. ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ చిప్.. ర్యామ్ 12 జీబీ.. స్టోరేజ్ 256 జిబి.. వెనుక కెమెరాలు 50 మెగాపిక్సల్+ 50 మెగా పిక్సెల్.. సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సల్.. బ్యాటరీ 5000 ఎంఏహెచ్.. బరువు సుమారు 215 గ్రాములు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వివరాలు మొత్తం లీకుల ఆధారంగానే తెలుస్తున్నాయి. అధికారిక స్పెసిఫికేషన్లు విడుదల కావడానికి ఇక కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

శ్యాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో 7.6 అంగుళాల ప్రధాన డిస్ ప్లే.. 201 గ్రాముల బరువు.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ జెడ్ 5 ఫర్ గెలాక్సీ చిప్ ఉన్నాయి. పెద్ద స్క్రీన్ తో మల్టీ టాస్కింగ్.. వీడియో ఎడిటింగ్.. ఆఫీస్ పనులు చేసుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మోటోరోలా Razr Flex విషయంలో ప్రధానంగా డిజైన్.. పోర్టబిలిటీ అత్యంత ముఖ్యం కాబోతున్నాయి. తక్కువ పరిమాణంలో ఫోల్డబుల్ ఫోన్ కావాలి అనుకునే వారికి ఇది అత్యంత గొప్పగా ఉండవచ్చు. లోపల డిస్ ప్లే 6.92 అంగుళాలే. శాంసంగ్ అందించే పెద్ద స్క్రీన్ అనుభూతిని ఇది అందించకపోవచ్చు.

డిసెంబర్లో వస్తుందా

ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం మోటరోలా Razr Flex డిసెంబర్ మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ నుంచి అధికారిక విడుదల తేదీ.. ధర.. భారత మార్కెట్లో లభ్యతపై క్లారిటీ రావాల్సి ఉంది.

సాంసంగ్ కంపెనీకి ముప్పు ఉన్నట్టేనా

మోటరోలా నుంచి కొత్త ఫోన్ రావడంతో శ్యాంసంగ్ ఫోల్డబుల్ మార్కెట్ కు పోటీ పెరగడం ఖాయమని తెలుస్తోంది. అయితే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 కు Razr Flex ఎలా పోటీ ఇస్తుందనేది వచ్చే రోజుల్లో తెలుస్తుంది. ఈ రెండు ఫోన్ల డిజైన్.. స్క్రీన్ పరిమాణాలు వేరే విధంగా కనిపిస్తున్నాయి. తన కొత్త మోడల్ ఫోన్ ధరను మోటోరోలా ఎంత నిర్ణయిస్తుంది.. బ్యాటరీ పని తీరు ఎలా ఉంటుంది.. కెమెరాలు ఏ స్థాయిలో పనిచేస్తాయి.. అనే విషయాలు మోటరోలా బ్రాండ్ అమ్మకాలను నిర్ణయిస్తాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper