HomeతెలంగాణEtela Bandi Meeting: ఈటల, బండి అలయ్ బలయ్: కార్యకర్తలు ఏం తెలుసుకోవాలంటే..

Etela Bandi Meeting: ఈటల, బండి అలయ్ బలయ్: కార్యకర్తలు ఏం తెలుసుకోవాలంటే..

Etela Bandi Meeting: రాజకీయ నాయకులు రాజకీయాలు మాత్రమే చేస్తారు. వాళ్లకు అనుకూలమైన పనులు మాత్రమే చేస్తారు. అంటే తప్ప కార్యకర్తల అభీష్టానికి నడుచుకోరు. రాజకీయాలు అంటే సేవ కాదు. అది ఒక వ్యాపారం. కానీ కొంతమంది కార్యకర్తలు రాజకీయ నాయకులు చెప్పేది నిజం అనుకుంటారు. వారు వేసే అడుగులు గొప్పవి అనుకుంటారు. వారు మాట్లాడే మాటలు సత్య వాక్కులు అని నమ్ముతుంటారు. అలా నమ్మినవారు చివరికి బోర్లా పడటం ఖాయం.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాకా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్.. ఈటెల రాజేందర్ మధ్య ఉప్పు నిప్పులాగా వ్యవహారం ఉండేది. వారిద్దరు కూడా పోటా పోటీగా విమర్శలు చేసుకునేవారు. ఈ
ఏనాడు కూడా నేరుగా ఒకరిపై ఒకరు కాకుండా.. పరోక్షంగా వీరి ఆరోపణల వ్యవహారం సాగేది. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు. పైగా ప్రజల్లో మంచి పట్టు ఉన్న నాయకులు. అలాంటప్పుడు వీరిద్దరూ మాట్లాడే మాటలకు సహజంగానే రీచ్ ఉంటుంది.

చాలా కాలం పాటు వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ విరోధులుగా ఉండేవారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు. కాకపోతే వీరిద్దరి వ్యవహార శైలి వల్ల పార్టీ కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేవారు. దీనివల్ల పార్టీలో క్రమశిక్షణ లోపిస్తోంది అనే సంకేతాలు అధిష్టానానికి వెళ్ళాయి. ఇంకేముంది కొద్దిరోజులు అధిష్టానం వేచి చూసింది. అప్పటికి మార్పు రాకపోవడంతో.. నేరుగా పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ ను రంగంలోకి దింపింది..

లక్ష్మణ్ బండి సంజయ్.. ఈటెల రాజేందర్ తో మాట్లాడారు. ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదాలకు చెక్ పెట్టించారు.. తద్వారా వివాదానికి ముగింపు పలికించారు. విలేకర్ల ముందుగానే బండి సంజయ్.. రాజేందర్ ఒకరినొకరు ఆ లింగనం చేసుకున్నారు. కాకపోతే ఈ వ్యవహారంలో కార్యకర్తలే వెర్రి పుష్పాలు అయ్యారు.. ఇలాంటప్పుడే కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు అవసరాలకు తగ్గట్టుగా అడుగులు వేస్తుంటారు. వాళ్ళు చెప్పే మాటలను.. వేసే అడుగులను నమ్మితే పరిస్థితి ఇలానే ఉంటుంది. అందువల్లే కార్యకర్తలు అర్థం లేని ఆవేశాలకు వెళ్లకూడదు. నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోకూడదు. వీరావేశంలో దాడులకు పాల్పడకూడదు. ఎందుకంటే శ్మశానం ముందు ముగ్గు ఉండదు. రాజకీయ నాయకులు సిగ్గు ఉండదు. దీనిని కార్యకర్తలు మననం లో పెట్టుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular