Assam Flood Scam: విపరీతంగా వర్షాలు.. అంతకుమించిన స్థాయిలో వరద.. చూస్తుండగానే ఉన్న ఇల్లు కొట్టుకుపోయింది. సంపాదించిన ఆస్తులు నీటిలో కరిగిపోయాయి. తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు. ఉండేందుకు ఆవాసం లేదు .
అస్సాం రాష్ట్రంలో విపరీతంగా వరదలు వస్తున్నాయి. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితి ఉన్నప్పటికీ.. అస్సాం రాష్ట్రంలో దీనికి భిన్నంగా సాగుతోంది. అక్కడ విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద కూడా అధికంగా వస్తోంది. ప్రమాదకరమైన స్థాయిని దాటిపోయి అక్కడ నదులు ప్రవహిస్తున్నాయి. దీంతో వరద నీరు మొత్తం ముంచెత్తి జనాలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. దాదాపు 80 మంది దాకా ప్రజలు వరదల్లో చిక్కుకొని చనిపోయారు.
అస్సాం రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉండడంతో.. మానవత దృక్పథం కలిగిన వారు ముందుకు వస్తున్నారు. అక్కడి ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఆహారం.. మందులు.. దుప్పట్లు.. నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ సహాయం ముసుగులో కొంతమంది దుర్మార్గులు చేరారు. వారంతా కూడా సోషల్ మీడియా వేదికగా అస్సాం వరద బాధితుల కన్నీళ్లను క్యాష్ చేసుకుంటున్నారు.
కొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు సహాయం పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లో సృష్టించారు. విరాళాల పేరుతో దోచుకోవడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారాన్ని ఇండియా టుడే డిఎస్ఐఎన్టి విచారణ నిర్వహించింది. ఈ నేపథ్యంలో 90% అకౌంట్లు ఫేక్ అని తేలింది. దీంతో ఆ దుర్మార్గుల అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు.. ఇలాంటి కష్ట కాలంలో కూడా ఈ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్న వారిని వదిలిపెట్టకూడదని.. వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
అస్సాం రాష్ట్రంలో వరదలు రావడం ఇదే తొలిసారి కాకపోయినప్పటికీ.. ఈసారి దేశవ్యాప్తంగా కరువు ఉన్నప్పటికీ.. అస్సాం రాష్ట్రంలో మాత్రం తీవ్రస్థాయిలో వరదలు వస్తున్నాయి. అనేక నదులు ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడ జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కష్ట కాలంలో కొంతమంది వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వారి కన్నీళ్లు తుడవకుండా.. ఇలా దోపిడీకి పాల్పడడం విచారకరమని నెటిజన్లు పేర్కొంటున్నారు. సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిపోయిన తర్వాత ఇటువంటి మోసగాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారు. సేవ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటువంటి వారి వల్ల సమాజానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని నెటిజన్లు ఆవేదనతో పేర్కొంటున్నారు.