సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి.. ఇప్పుడు సినిమా లేక.. ఏ స్టార్ హీరోని ఒప్పించలేక ప్రస్తుతం కథ మీద కుస్తీ పడుతున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి. నిజానికి ఒక కొత్త డైరెక్టర్ అయినా సరే… ఒక సూపర్ హిట్ సినిమా తీసిన తరువాత, స్టార్ హీరోలు పిలిచి మరీ అవకాశం ఇవ్వడం అనేది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు జనరేషన్ల నుండీ వస్తోన్న ఆనవాయితీ.. మరియు ఒక అలవాటు. అలాంటిది ఒక్క వంశీ విషయంలోనే ఇది ఎందుకో సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అని, హీరోల చుట్టూ తిరిగి సినిమాని ఫిక్స్ చేసుకోవడం వంశీకి మొదటినుండి అలవాటు లేదు. బహుశా అందుకేనేమో ఆయనకు అంతత్వరగా సినిమాలు సెట్ అవ్వవు.
Also Read: మళ్లీ సౌత్‌పై కన్నేసిన తాప్సీ
గతంలో ఊపిరి సినిమాకి ఇలాగే జరిగింది. అంతకుముందు బృందావనం సినిమాకి ఇలాగే జరిగింది. దిల్ రాజును ఈ విషయంలో మెచ్చుకోవాలి.. వంశీ సమస్య తెలుసు కాబట్టే.. వంశీ సినిమాలకు హీరోలను సెట్ చేసే బాధ్యత తాను తీసుకునేవాడు. కానీ ఈ సారి వంశీనే తన సినిమా హీరో కోసం తానే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ ఏ స్టార్ హీరో సెట్ కావడం లేదు. మహర్షి హిట్ టాక్ రాగానే వంశీ నిర్ణయించుకున్న మొదటి నిర్ణయం.. తన తదుపరి చిత్రాన్ని కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే చేయాలని. మహేష్ కోసం రాయలసీమ నేపథ్యంలో కథ కూడా రెడీ చేశాడు. మహేష్ ను ఒప్పించడానికి బాగానే ప్రయత్నాలు చేశాడు. కానీ ఎందుకో మహేష్ కి వంశీ చెప్పిన కథ నచ్చలేదు. మహర్షి నుండి వంశీతో మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తూ వస్తోన్న మహేష్, ఈ సినిమాను చేయలేను అని చెప్పలేక, ఈ కథ చరణ్ కి అయితే బాగుంటుందని సలహా ఇచ్చాడు.
Also Read: బన్నీ- కొరటాల.. భరత్ అనే నేను ఫార్ములా
ఈ లోపు తానూ పరుశురామ్ సర్కారు వారి పాట సినిమాకి డేట్స్ ఇచ్చేశాడు. ఇక వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. చరణ్ ను కలిసి కథ కూడా చెప్పాడు. కథ రాయలసీమ నేపథ్యంలో నడిచే పక్కా యాక్షన్ సినిమా కావడం, గతంలో ఇలాంటి యాక్షన్ సినిమానే బోయపాటితో చేస్తే అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అంటూ చరణ్ కూడా వంశీ సినిమాని సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు వంశీకి ఉన్న అప్షన్.. అల్లు అర్జునే. అయితే బన్నీ కూడా ప్రస్తుతం సుకుమార్ తో యాక్షన్ సినిమానే చేస్తున్నాడు. అలాగే ఐకాన్ అనే సినిమాని కూడా ఇప్పటికే లైన్ లో పెట్టాడు. ఇక ప్రభాస్ తో సినిమా అంటే మరో మూడేళ్లు ఆగాల్సిందే. అంత బిజీగా ఉన్నాడు ప్రభాస్. మొత్తానికి హిట్ సినిమా ఇచ్చిన తరువాత కూడా, ఒక స్టార్ డైరెక్టర్ కి హీరో దోరకకపోవడం అంటే.. బ్యాడ్ టైమే అనుకోవాలి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Star director who gave the super hit has no movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com