Nagarjuna and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు వస్తు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నాయి. కానీ ఒకప్పుడు స్టార్ హీరో ఆయన మహేష్ బాబు, నాగార్జున కాంబినేషన్ లో కూడా మల్టీస్టారర్ సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇంతకీ ఆ సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న దర్శకుడు ఎవరు అంటే క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కృష్ణవంశీ(Krishna Vamsh)… ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలను చేయడంలో కృష్ణవంశీ దిట్ట…మరి ఇలాంటి సందర్భంలోనే నాగార్జున, మహేష్ బాబులను పెట్టి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ సినిమాని చేయాలని అనుకున్నాడట. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా వర్కౌట్ కాలేదు. అయితే కృష్ణవంశీ నాగార్జునకి నిన్నే పెళ్ళాడుతా, మహేష్ బాబుకి మురారి లాంటి రెండు సూపర్ సక్సెస్ లను అందించాడు. వీళ్ళిద్దరితో మల్టీ స్టారర్ సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందని ఆయన భావించారట. కానీ అది కార్యరూపం దాల్చలేదు. మరి ఏది ఏమైనా కూడా నాగార్జున మహేష్ బాబు ఇద్దరూ కూడా ఇటు ఫ్యామిలీ అభిమానుల్లో గాని లేడీ ఫ్యాన్స్ ని గాని సంపాదించుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు.
Also Read : నాగార్జున, మహేష్ బాబు అంత యంగ్ గా కనిపించడానికి కారణం తెలుసా? వారిద్దరి లైఫ్ స్టైల్ తెలిస్తే షాక్ అవుతారు
సగటు ప్రేక్షకులతో పాటు వీళ్ళ సినిమాలను ఒకటికి రెండుసార్లు చూసే కొంతమంది అభిమానులు కూడా ఉండటం విశేషం. అప్పుడైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా మిస్సైంది. కానీ ఇక మీదట రాబోయే రోజుల్లో అయిన వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందా..?ఇప్పుడున్న వాళ్లలో వీళ్ళ కాంబినేషన్ లో సినిమాను చేసే దర్శకుడు ఎవరు అనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా కృష్ణవంశీ లాంటి స్టార్ డైరెక్టర్ ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తే అది ఎలా ఉంటుంది అంటూ అటు అతని అభిమానులు సైతం కొంతవరకు ఇబ్బందిని తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళందరికి మంచి గుర్తింపు అయితే ఉంది.
కాబట్టి రాబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు. తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటి వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీగా ఉండగా, నాగార్జున మాత్రం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న కూలీ సినిమాలో విలన్ క్యారెక్టర్ ను పోషిస్తున్నాడు.
Also Read : కెరియర్ మొదట్లో నాగార్జున, మహేష్ బాబుల కోసం రంగం లోకి దిగిన స్టార్ హీరోలు…