Okkadu re-released : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన చిత్రం ‘ఒక్కడు'(Okkadu Movie). అప్పటి వరకు కేవలం ఒక మామూలు హీరో గా మాత్రమే ఇండస్ట్రీ లో నెట్టుకొస్తున్న మహేష్ బాబు, ఈ సినిమాతో స్టార్ హీరోగా మారాడు. ఇక అప్పటి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అసలు రాలేదు. కెరీర్ లో సంచలనాత్మక చిత్రాలను తీస్తూ, సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే అలాంటి ఒక్కడు చిత్రం నేటి తరం ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదా అంటే కచ్చితంగా అవుననే చెప్పాలి. మహేష్ బాబు నుండి ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాలలో పెద్దగా ఆదరణ దక్కించుకోని చిత్రం ఏదైనా ఉందా అంటే అది ఒక్కడు చిత్రం మాత్రమే. హీరోయిజం కి సరికొత్త నిర్వచనం తెలిపిన ఈ సినిమాని ఇప్పటి వరకు 5 సార్లు రీ రిలీజ్ చేసారు.
Also Read : మార్కెట్ లో ‘యుగానికి ఒక్కడు’ రీ రిలీజ్ కి సెన్సేషనల్ డిమాండ్..పవన్, మహేష్ రికార్డ్స్ అవుట్!
నిన్న కూడా ఈ చిత్రాన్ని లిమిటెడ్ షోస్ తో రీ రిలీజ్ చేసారు. 18 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మహేష్ ఫ్యాన్స్ కి అడ్డాగా పిలవబడే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ లో తప్ప, ఈ చిత్రానికి ఎక్కడా హౌస్ ఫుల్ పడలేదు. అయితే 5 సార్లు రీ రిలీజ్ అయిన ఈ చిత్రానికి, మొత్తం గ్రాస్ ని లెక్క వేసుకుంటే ఇప్పటి వరకు 3 కోట్ల 20 లక్షలు మాత్రమే వచ్చింది. రామ్ చరణ్(Global Star Ram Charan) డిజాస్టర్ ఫ్లాప్ చిత్రం ‘ఆరెంజ్’ ని ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే రీ రిలీజ్ చేసారు. ఈ రెండు రీ రిలీజ్ లకు కలిపి ఆ చిత్రానికి 4 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 5 సార్లు రీ రిలీజ్ అయిన ‘ఒక్కడు’ చిత్రానికి, కేవలం రెండు సార్లు రీ రిలీజ్ అయిన ఒక్కడు చిత్రానికి ఎంత గ్యాప్ ఉందో మీరే చూడండి.
మరో వైపు ఒక్కడు తమిళ వెర్షన్ ‘గిల్లీ’ కి మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. విజయ్(Thalapathy Vijay) హీరో గా నటించిన ఈ సినిమా రీ రిలీజ్ లో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది కేవలం రీ రిలీజ్ లోనే కాదు, డైరెక్ట్ రిలీజ్ సమయంలో కూడా ఒక్కడు కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ రోజుల్లో తమిళనాడు లో ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. కేవలం రజినీకాంత్ కి మాత్రమే సాధ్యమయ్యే అలాంటి ఫీట్స్, మొదటి సారి యంగ్ హీరోగా పిలవబడే విజయ్ రిపీట్ చేసాడు. తెలుగు నాట ‘ఒక్కడు’ చిత్రం ఒక మామూలు బ్లాక్ బస్టర్ మాత్రమే, కానీ ‘గిల్లీ’ చిత్రం తమిళనాడు సంస్కృతి లో ఒక భాగం అయిపోయింది.
Also Read : ఒక్కడు సినిమాకు ముందు అనుకున్న టైటిలే పెట్టుంటే అసలు ఎలా ఉండేదో ఊహించుకోగలరా…