Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే చాలు ప్రస్తుతం రాజమౌళి అందరికి గుర్తుకొస్తున్నాడు. కారణమేంటి అంటే ఆయన పాన్ ఇండియాలో భారీ సంచలనాలను క్రియేట్ చేసి ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా స్థాయికి వెళ్తున్నాడు. కాబట్టి ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఉంటాడు. అందువల్లే రాజమౌళి అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంచి గౌరవం అయితే ఉంది.
Also Read : మహేష్ పని ఇక అయిపోయినట్టే..రాజమౌళి ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదుగా!
దర్శక ధీరుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)… ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆయన సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ను కేటాయించి ఎలాగైనా సరే ఆ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా కోసం ఆయన తన స్వాయా శక్తుల ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే సెకండ్ షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి లాంటి ఒక గొప్ప దర్శకుడు కెరియర్ లో కూడా ఆయన చేసిన కొన్ని సినిమాలకి మొదట్లో డివైడ్ టాక్ అయితే వచ్చింది. కానీ ఆ సినిమాలు ప్రేక్షకులకు నచ్చడంతో సక్సెస్ ఫుల్ గా మారాయి… ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అంటే నితిన్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా… మొదట ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమాకి మొదట అనుకున్న రేంజ్ లో ఆదరణ అయితే దక్కలేదు. ఆ తర్వాత అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పటికి ఓవరాల్ గా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చడంతో లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమాకి భారీ లాభాలు అయితే రాలేదనే చెప్పాలి…
ఇక ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ (Yamadonga) సినిమా కూడా మొదట్లో డివైడ్ టాక్ అయితే తెచ్చుకుంది. నిదానంగా ప్రేక్షకుల యొక్క మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకొని రాజమౌళికి ఎన్టీఆర్ కి సూపర్ సక్సెస్ ను సాధించి పెట్టింది. ఇక ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా మొదటి పార్ట్ సైతం అతనికి ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించి పెట్టలేదు.
మొదట్లో ఈ సినిమాకి భారీగా డివైడ్ టాక్ రావడమే కాకుండా రాజమౌళి చాలా విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. అసలు ఈ సినిమాలో ఎమోషనే లేదు. ఇలాంటి సినిమాలు ఎలా చేశారు అంటూ కొంతమంది విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ మొత్తానికైతే ఆ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించి 600 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.
Also Read : మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్!