Mahesh Babu: రీ రిలీజ్ ట్రెండ్ మన టాలీవుడ్ లోనే కాదు, ఇండియా వైడ్ గా ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ లో అత్యధిక శాతం సక్సెస్ రేట్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) మాత్రమే. ఆయన తర్వాత స్థానం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచాడు. ప్రతీ పుట్టినరోజుకు మహేష్ బాబు అభిమానులు పాత సినిమాలను అత్యాధునిక టెక్నాలజీ కి మార్చి గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తుంటారు. అలా ఈ ఏడాది కూడా అలా గ్రాండ్ గా మహేష్ సినిమాని రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. ఈ సంవత్సరం ‘అతడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలనీ సోషల్ మీడియా వ్యాప్తంగా మహేష్ అభిమానులు పీఆర్ టీం ని ట్యాగ్ చేసి ఎంతో రిక్వెస్ట్ చేశారు.
Also Read: అక్షరాలా 400 మిలియన్ వ్యూస్..చరిత్ర సృష్టించిన ‘గేమ్ చేంజర్’
కానీ అతడు కి బదులుగా ‘టక్కరి దొంగ’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు నాల్గవ చిత్రమిది. అప్పట్లో అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రమిది. మళ్ళీ మహేష్ తేరుకోవడానికి ఒక్కడు వరకు ఆగాల్సి వచ్చింది. కానీ ఆరోజుల్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ, నేటి తరం ఆడియన్స్ కి మాత్రం ఈ చిత్రం బాగా నచ్చింది. అంతే కాదు ఈమధ్య కాలంలో కౌ బాయ్ నేపథ్యం లో సినిమాలు రావడం బాగా తగ్గిపోయాయి. కాబట్టి మళ్ళీ ఈ చిత్రాన్ని వెండితెర మీదకు తీసుకొస్తే కచ్చితంగా జనాలు ఆదరిస్తారు అనే నమ్మకంతో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఆగస్టు 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే మహేష్ ఫ్యాన్స్ ఈ చిత్రానికి బదులు ఆగస్టు 9న ఖలేజా ని అయినా విడుదల చేయొచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తున్నారు.
కానీ ఖలేజా చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదల కాబోతుంది. దీనిపై మహేష్ ఫ్యాన్స్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా, మామూలు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని, 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న చిత్రమని, దయచేసి దీనిని ఆగస్టు 9 న విడుదల చేయాలనీ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు, కానీ అటు వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ మోడ్ లో ఉన్నారు. అదే మే 31న అతిధి చిత్రం కూడా రీ రిలీజ్ కానుంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ నెల 26 న మహేష్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన ‘భరత్ అనే నేను’ చిత్రం విడుదల కానుంది.
Also Read: ‘రెట్రో’ మూవీ మొట్టమొదటి రివ్యూ..క్లైమాక్స్ ఆడియన్స్ ఏడుపు ఆపుకోలేరు!