Bharat Ane Nenu : ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రీ రిలీజ్ ట్రెండ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) కి అత్యధిక సక్సెస్ రేట్ ఉంది. ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన కల్ట్ క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి. అందుకే అవి రీ రిలీజ్ అయ్యినప్పుడు మంచి వసూళ్లను రాబడుతున్నాయి. కానీ ఈసారి మాత్రం మహేష్ బాబు కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మహేష్ బాబు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రం ‘భరత్ అనే నేను'(Bharat Ane Nenu). శ్రీమంతుడు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తో మహేష్ చేసిన రెండవ చిత్రమిది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, మంచి వసూళ్లను రాబట్టింది. ఆ రోజుల్లోనే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 92 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన సినిమా ఇది.
Also Read : భరత్ అనే నేను సినిమాలో ఇంత పెద్ద పొరపాటా?
ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రతీ ఒక్కరిలో కోరికని రగిలించిన చిత్రమిది. అలాంటి సినిమా రీ రిలీజ్ అయితే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు కానీ, అందుకే ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ఈ నెల 26న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల క్రితమే మొదలయ్యాయి. హైదరాబాద్ లోని టాప్ థియేటర్స్ అన్నిట్లో బుకింగ్స్ ప్రారంభించారు, కానీ కనీసం ఇప్పటి వరకు వెయ్యి టిక్కెట్లు కూడా అమ్ముడుపోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహేష్ ఫ్యాన్స్ కి అడ్డాగా పిలవబడే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ లో ఒక్కట్టే హౌస్ ఫుల్ బోర్డు పడింది. అది కూడా ఫ్యాన్స్ థియేటర్ మొత్తాన్ని బ్లాక్ చేసుకున్నారని కొంతమంది అంటున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాని బ్యాన్ చేసారని తెలుస్తుంది.
ఎందులకంటే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్, అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకుంటూ ఇలా తమ అభిమాన హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నాడని, కేవలం పుట్టినరోజు కి విడుదలయ్యే సినిమాలను తప్ప, ఇలాంటి థర్డ్ పార్టీ రిలీజ్ లను బ్యాన్ చేయాలనీ నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే ఈ సినిమాకు ఇలాంటి వీక్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవ్వడానికి కారణం అయ్యింది అంటూ మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ‘కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు’ సినిమాని ఇలాగే బ్యాన్ చేయమని పిలుపునిచ్చారు. అయినప్పటికీ ఆ సినిమాకు భారీ స్థాయిలో హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. మొదటి రోజు దాదాపుగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘భరత్ అనే నేను’ కి కనీసం పది లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చేలా లేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Also Read : యూఎస్ ప్రీమియర్స్ ద్వారా ఎక్కువ వసూలు చేసిన మూవీలు ఇవే.. టాప్ లో ఆ సినిమానే..