Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu : మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఎందుకు ఇచ్చింది? షాకింగ్ నిజాలు!

Mahesh Babu : మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఎందుకు ఇచ్చింది? షాకింగ్ నిజాలు!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. ఆయనకున్న భారీ ఫ్యాన్ బేస్ రీత్యా పలు వ్యాపార సంస్థలకు ఆయన ప్రచార కర్తగా ఉన్నారు. సదరు సంస్థల ఉత్పత్తులు, సేవలకు ప్రచారం కల్పించడం ద్వారా ఆయన కోట్లలో ఆర్జిస్తున్నారు. హీరోగా రాణిస్తూనే మహేష్ బాబు వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన పేరిట ఓ ఆన్లైన్ గార్మెంట్ బ్రాండ్ ఉంది. ఏఎంబీ సినిమాస్ పేరుతో ఒక మల్టీ ఫ్లెక్స్ నడుపుతున్నారు. అలాగే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. తాను నటించే సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉంటారు. లాభాల్లో వాటా తీసుకుంటారు.

Also Read : మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్!

మహేష్ బాబులో సామాజిక స్పృహ, సేవా దృక్పధం కూడా ఉన్నాయి. మహేష్ బాబు ఫౌండేషన్ వందల మంది పేద చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించింది. అలాగే ఆయన ఏపీ తెలంగాణాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. తన సంపాదనలో కొంత మేర సామాజిక సేవకు ఆయన ఖర్చు చేస్తున్నారు. అలాంటి మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చకు దారి తీసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మహేష్ బాబును ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. దాంతో మహేష్ బాబు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారా? అనే అనుమానాలు చెలరేగాయి.

కాగా మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇవ్వడానికి కారణం, ఆయన గతంలో ఒక వ్యాపార సంస్థకు ప్రచార కర్తగా వ్యవహరించడమే. సాయి సూర్య డెవెలపర్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థను మహేష్ బాబు ప్రమోట్ చేశారు. ఇటీవల సాయి సూర్య డెవెలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఈడీ అధికారులు దాడులు చేశారు. సదరు సంస్థలు దాదాపు రూ. 100 కోట్ల అనధికారిక ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు. గతంలో ఈ సంస్థలలో పెట్టుబడి పెట్టిన కస్టమర్స్, తాము మోసపోయాం అంటూ కేసులు పెట్టారు. సాయి సూర్య డెవెలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్థిక పరమైన నేరాలకు పాల్పడ్డారని ఈడీ ఆధారాలు సేకరించింది.

ఈ క్రమంలో సాయి సూర్య డెవలపర్స్ కి ప్రచార కర్తగా వ్యవహరించిన మహేష్ బాబును కూడా విచారించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ అంశం పై మహేష్ బాబు టీం స్పందించాల్సి ఉంది. మరోవైపు మహేష్ బాబు ssmb 29 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ అని ప్రచారం జరుగుతుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడని సమాచారం.

Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!

RELATED ARTICLES

Most Popular