Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ఎమోషనల్ అవ్వడం చాలా తక్కువసార్లు చూసి ఉంటాము. కానీ రీసెంట్ సమయంలో ఆయన తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి కఠినతరమైన పరిస్థితులు పగవాడికి కూడా రాకూడదు అని అనుకుంటూ ఉంటారు అభిమానులు. చిన్నప్పటి నుండి తండ్రిలా పెంచిన అన్నయ్య రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకు తల్లి ఇందిరమ్మ కూడా కన్ను మూసింది. ఇక మహేష్ బాబు దైవంగా భావించే తన తండ్రి కృష్ణ కూడా ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకే తుది శ్వాసని విడిచాడు. ఎంతో ఇష్టమైన వాళ్ళు తక్కువ సమయంలోనే ఇలా ప్రాణాలు వదిలేస్తే ఒక మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా?, పాపం మహేష్ బాబు పరిస్థితి అదే. నేడు ఆయన తల్లి ఇందిరా దేవి గారి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన తల్లిని తల్చుకుంటూ ఇన్ స్టాగ్రామ్ లో వేసిన పోస్ట్ బాగా వైరల్ అయ్యింది.
Also Read : రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బాబు డిజాస్టర్ మూవీ..’అతడు’ ఇక లేనట్టే!
‘పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా..నిన్ను ఎంత మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను’ అంటూ తన తల్లితో కలిసున్న ఒక ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. మహేష్ బాబు చెప్పిన ఆ శుభాకాంక్షలలో ఆయన మనసులో తన తల్లి ఇప్పుడు తనతో లేదు అనే బాధ కనిపించింది. దానికి అభిమానులు కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ప్రతీ ఏడాది ఇందిరా దేవి గారి పుట్టినరోజున ఎన్ని పనుల్లో ఉన్నా సరే, అవన్నీ పక్కన పెట్టి, ఆమె ఇంటికి వెళ్లి డిన్నర్, లంచ్ వంటివి చేసి, ఆరోజు మొత్తం ఎంతో సంతోషంగా గడిపేవాడు మహేష్ బాబు మరియు ఆయన కుటుంబ సభ్యులు. కృష్ణ గారు కూడా ఎన్నో సందర్భాల్లో ఇందిరా దేవి గారి పుట్టినరోజు నాడు ప్రేమతో కేక్ కట్ చేసి తినిపించిన ఫోటోలను, వీడియోలను మనం గతం లో చూసాము.
ముఖ్యంగా సితార కి ఇందిరా దేవి గారంటే ఎంతో ప్రేమ, అభిమానం. ఆమె చనిపోయిన రోజున సితార వెక్కిళ్లు పెట్టి ఏ రేంజ్ ఏడ్చిందో మనమంతా చూసాము. మహేష్, నమ్రత ఆమెని కంట్రోల్ చేయలేకపోయారు. అంతటి గొప్ప అనుబంధం తన నాన్నమ్మ తో పెనవేసుకుంది సితార. నేడు పుట్టినరోజు సందర్భంగా ఆమె తమతో లేదు అనే బాధ కచ్చితంగా సితార లో కూడా ఉండి ఉంటుంది. ఏది ఏమైనా అమ్మానాన్నలు లేని లోటు ని ఎవ్వరు పూడ్చలేరు. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే మొదలై ఒడిశా లో మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. త్వరలోనే రెండవ షెడ్యూల్ కూడా మొదలు కానుంది. అందుకు సంబంధించిన వర్క్ షాప్ కూడా హైదరాబాద్ లో జరుగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.