Mahesh Babu and Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంట ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ఇప్పుడు చాలామంది హీరోలు పాన్ ఇండియా బాట పడుతూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే మన హీరోల నుంచి వచ్చే సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించే విధంగా ఉండాలని ఉద్దేశ్యంతో దర్శకులందరూ కూడా సగటు ప్రేక్షకుడిని మెప్పించే సినిమాలయితే చేస్తున్నారు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మన హీరోలకు పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ ప్రేక్షకులైతే తెలుగు సినిమా హీరోల కోసం పడి చచ్చిపోయేంత అభిమానులుగా మారిపోయారు. ముఖ్యంగా ప్రభాస్(Prabhas) లాంటి స్టార్ హీరో భారీ విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తుండగా అతని బాట లోనే అల్లు అర్జున్(Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) లాంటి నటులు నడుస్తున్నారు.
Also Read : హీరోలను బందీలుగా మారుస్తున్న డైరెక్టర్స్… నిన్న మహేష్…ఇప్పుడు ప్రభాస్…
ముఖ్యంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి రాజమౌళి డైరెక్షన్ లో ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో భారీ మల్టీ స్టారర్ సినిమాను చేశారు. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన అతి పెద్ద భారీ మల్టీ స్టారర్ సినిమా కూడా ఇదే కావడం విశేషం…మరి అలాంటి ఒక సినిమాను తీసి సూపర్ సక్సెస్ గా నిలిపిన రాజమౌళి స్టామినా ఏంటో మనకు తెలిసిందే.
మరి ఆయన కనక ఆ సినిమాను తీసి ఉండకపోతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇలాంటి ఒక గొప్ప మల్టీ స్టారర్ సినిమా వచ్చిండేది కాదు అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి ఈ సినిమా కంటే ముందే ప్రభాస్ మహేష్ బాబులతో పూరి జగన్నాధ్ ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేశాడు. కానీ ఆయన అప్పుడున్న సక్సెస్ రేట్ ను బట్టి మహేష్ బాబు ఆ సినిమాకి పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదట. ప్రభాస్ మాత్రం ఆ సినిమా కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇక మొత్తానికైతే మొదటగా వీళ్ళిద్దరూ చేయాల్సిన మల్టీ స్టారర్ సినిమాని రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసి సూపర్ సక్సెస్ ను సాధించారు. మరి ఇప్పటికైనా మహేష్ బాబు ప్రభాస్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : మహేష్ బాబు చేయాల్సిన ఆ సూపర్ హిట్ సినిమాను ప్రభాస్ చేశాడా..?