Homeక్రీడలుక్రికెట్‌Ishan Kishan: ఇషాన్ కిషన్ మెరుపుల వెనుక ఉన్నది లెజెండ్ ప్లేయర్.. వెలుగులోకి సంచలన నిజం

Ishan Kishan: ఇషాన్ కిషన్ మెరుపుల వెనుక ఉన్నది లెజెండ్ ప్లేయర్.. వెలుగులోకి సంచలన నిజం

Ishan Kishan: ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఐదు t20 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ తో దుమ్ము రేపాడు. తద్వారా టి20 వరల్డ్ కప్ లో భారీగా పరుగులు చేయగల సత్తా ఉన్న ఆటగాడిగా ఆవిర్భవించాడు. ఈ నేపథ్యంలో మీడియాలో ఇషాన్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపిక కాక ముందు ఇషాన్ రెండు సంవత్సరాల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. […]

Ishan Kishan: ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఐదు t20 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ తో దుమ్ము రేపాడు. తద్వారా టి20 వరల్డ్ కప్ లో భారీగా పరుగులు చేయగల సత్తా ఉన్న ఆటగాడిగా ఆవిర్భవించాడు. ఈ నేపథ్యంలో మీడియాలో ఇషాన్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది.

న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపిక కాక ముందు ఇషాన్ రెండు సంవత్సరాల పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అతడు డొమెస్టిక్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఝార్ఖండ్ జట్టుకు నాయకుడిగా వ్యవహరించాడు. ఆ జట్టుకు తొలిసారి డొమెస్టిక్ ట్రోఫీ అందించాడు. ఆ సిరీస్ లో అతడు పరుగుల ప్రవాహం కొనసాగించాడు. అతడు అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో మేనేజ్మెంట్ న్యూజిలాండ్ సిరీస్ లో అవకాశం ఇచ్చింది.

న్యూజిలాండ్ సిరీస్ లో తిలక్ వర్మ చోటు దక్కించుకున్నప్పటికీ.. గాయం వల్ల అతడిని మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అతడి స్థానంలో ఇషాన్ కిషన్ కు చోటు కల్పించింది. వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్ సద్వినియోగం చేసుకున్నాడు. సంజు శాంసన్ విఫలమైనచోట అతడు మెరిశాడు. చివరికి త్రివేండ్రంలో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ కూడా చేశాడు.

ఇషాన్ కిషన్ స్థాయిలో ఆడటం వెనుక ఉన్న ఆటగాడు మరెవరో కాదు.. అతడే టీం ఇండియా లెజెండ్రీ ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఒకానొక దశలో మానసికంగా ఒత్తిడికి గురవుతున్న కిషన్ కు విరాట్ కోహ్లీ ఓదార్పును కలిగించాడు. 2020 ఐపిఎల్ సీజన్లో ముంబై జట్టు తరఫున కిషన్ 516 పరుగులు చేశాడు. కానీ 2021 కి వచ్చేసరికి అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పది మ్యాచ్లలో కేవలం 241 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సమయంలో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇషాన్ తో సంభాషించాడు.. విరాట్ కోహ్లీ పక్కకు రావడంతోనే కిషన్ ఏడ్చాడు. వెంటనే విరాట్ అతడి భుజం మీద చేయి వేసి ఓదార్చాడు. 2022లో కిషన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. వీరిద్దరూ కలిసి 290 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇండియాకు చారిత్రాత్మకమైన విజయాన్ని అందించారు. అదే విరాట్ కోహ్లీ ఓదార్చడంతో కిషన్ మళ్ళీ తన లోపాలను సవరించుకొని ఇప్పుడు ఏకంగా టి20 లో సెంచరీ చేశాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper