Homeక్రీడలుక్రికెట్‌Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav:  అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో సూర్య కుమార్ యాదవ్ దానిని రిపీట్ చేశాడు. తద్వారా టీమ్ ఇండియాకు తిరుగులేని స్థాయిని కల్పించాడు. ఇది ఒకరకంగా అద్భుతం.. అనన్య సామాన్యం. వాస్తవానికి ఈ ఘనత ఏ ఆటగాడు అయినా సాధిస్తే.. కచ్చితంగా ఆ జట్టు యాజమాన్యం అతడిని నెత్తి మీద పెట్టుకునేది. కానీ అక్కడ ఉన్నది గౌతమ్ గంభీర్.. సూర్య కుమార్ యాదవ్ నాయకుడిగా గొప్పగానే వ్యవహరిస్తున్నాడని
.. ఆటగాడిగా విఫలమవుతున్నాడని తెరపైకి సరికొత్త వివాదాన్ని తీసుకొచ్చాడు. మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. తాను అనుకున్నట్టుగా సూర్య కుమార్ యాదవ్ ను ఆటగాడిగా.. నాయకుడిగా.. ఇలా రెండు స్థానాల నుంచి విజయవంతంగా బయటికి పంపించాడు.

ఇక అప్పటినుంచి సూర్య కుమార్ యాదవ్ పడుతున్న ఇబ్బంది మామూలుది కాదు. పోనీ సూర్య కుమార్ యాదవ్ ను బయటికి పంపించిన తర్వాత టీమ్ ఇండియా ఏమైనా బాగుపడిందా అంటే.. వరుసగా 6 మ్యాచ్లలో ఓడిపోయింది. నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. రెండు సిరీస్లను వైట్ వాష్ చేసుకుంది. ఇందులో ఐర్లాండ్ చేతిలో ఓడిన తీరు టీమిండియా మేనేజ్మెంట్ వ్యవహార శైలికి ఒక చెప్పు దెబ్బ లాంటి ఫలితం. ఇన్ని రకాలుగా టీమిండియా వ్యతిరేక ఫలితాలను చూస్తున్నప్పటికీ గంభీర్ మారలేదు. సూర్య కుమార్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవాలి అనుకోలేదు.

మేనేజ్మెంట్ నిర్ణయమే శిరోధార్యం కాబట్టి.. సూర్య కుమార్ యాదవ్ కూడా మారు మాట మాట్లాడలేదు. జట్టులో స్థానం లేకపోయినప్పటికీ వెనకడుగు వేయలేదు. తన లోపాలను సవరించుకోవడం మొదలుపెట్టాడు. కొద్దిరోజులుగా అతడు తీవ్రంగా మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.. ప్రతిరోజు మూడు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాదాపు 1000 బంతులను ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సూర్యకుమార్ యాదవ్ తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్ట్ చేశాడు.. అతడు పడుతున్న కష్టాన్ని చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. టి20 వరల్డ్ కప్ విన్నర్ కు ఇటువంటి కష్టం ఏంటని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.. సూర్య కుమార్ కు జట్టులో చోటు కల్పించాలని.. అతడికి మళ్ళీ కెప్టెన్సీ అప్పగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి గౌతమ్ గంభీర్ వారి డిమాండ్లకు తలవంచుతాడా.. వారు కోరుకున్నట్టుగా చేస్తాడా..

అన్నట్టు ఇటీవల జింబాబ్వే సిరీస్ కు గౌతమ్ గంభీర్ దూరంగా ఉన్నాడు. లక్ష్మణ్ శిక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. టీమిండియాను గెలిపించాడు. ఆరు ఓటముల తర్వాత.. వరుసగా మూడు విజయాలు అందించాడు. రెండు సిరీస్ లు కోల్పోయిన తర్వాత.. ఏకపక్ష సిరీస్ ను అందించాడు. కోల్పోయిన నెంబర్ వన్ స్థానాన్ని కూడా తిరిగి ఇచ్చాడు. ఈ లెక్కన గంభీర్ పరిస్థితి కూడా డోలాయమానంలోనే ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bike Mileage Tips

Bike Mileage Tips: బండి మైలేజ్ కోసం సూపర్ 5 టిప్స్.. డబ్బులు బాగా సేవ్ అవుతాయి..

Bike Mileage Tips: ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొత్తగా టూ వీలర్ కొనాలని అనుకునేవారు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే వాహనాల వైపు చూస్తున్నారు. అయితే...
Jogi Rajeev

Jogi Rajeev: చంద్రబాబుకు మానసిక, శారీరక సమస్య.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ వ్యాఖ్యల వీడియో వైరల్..

Jogi Rajeev: ఫ్యాన్ పార్టీలో ముఖ్య నాయకుడు, నోటి దురుసు బిరుదాంకితుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వ్యవహారం కొద్ది రోజులుగా ఏపీ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఇతడు సూర్యాపేటకు...
Pakistan Democracy

Pakistan Democracy: పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం కనుమరుగు.. – రాజ్యాంగ సవరణతో అధికారాలు పాక్ ఆర్మీ చీఫ్ కు..

Pakistan Democracy: పాకిస్తాన్‌ చరిత్రలో సైన్యం ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇటీవలి రాజ్యాంగ సవరణలు, ముఖ్యంగా 27వ సవరణ, ఆ ఆధిపత్యాన్ని మరింత అధికారికం, కేంద్రీకృతం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య సంస్థలు...

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...
Vivo T5e

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...
Oktelugu Epaper