Newton’s Third Law Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది తమ సత్తా చాటుకుంటుంటే మరి కొంతమంది మాత్రం సక్సెస్ లు లేక డీలా పడిపోతున్నారు. అక్కినేని సుమంత్ లాంటి నటుడు డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన న్యూటాన్స్ థర్డ్ లా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను ఒక స్టార్ హీరో మిస్ చేసుకున్నాడంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ పాత్ర ను మొదటి వేరే హీరో కోసం అనుకున్నారట. కానీ ఆ హీరో నో చెప్పడంతో సుమంత్ దగ్గరికి వెళ్ళారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సుమంత్ మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
తను ఎంచుకునే సబ్జెక్ట్స్ మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంటాయని చెప్పడానికి ఈ సినిమాలను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే సినిమాల విషయంలో కూడా ఆయన పూర్తి క్లారిటి ని మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులందరిలో ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.
తను అనుకున్నట్టుగానే రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ ను సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతకీ న్యూటన్స్ థర్డ్ లా సినిమాకి మొదట అనుకున్న హీరో ఎవరంటే మంచు మనోజ్ గా తెలుస్తుంది. మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి డిఫరెంట్ పాత్రలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఆ తరహాలోనే అతని దగ్గరికి ఈ సినిమా కథని కూడా తీసుకెళ్లారట. కానీ మనోజ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని చేయలేక పోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనోజ్ వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… మొత్తానికైతే సుమంత్ ఈ సినిమాని సెట్ చేసుకొని ఒక మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి…