Samarth Jain : జాతీయ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే అంత ఈజీ కాదు. ఒక్కో స్థానం కోసం వందల మంది పోటీ పడుతూ ఉంటారు. అంతమందిని దాటుకుని చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. దక్కిన చోటును నిలబెట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. అందువల్లే ఆటగాళ్లు నిత్యం శ్రమిస్తూ ఉంటారు. మైదానంలో చెమటలు చిందిస్తూ ఉంటారు. అయితే ఈ ఆటగాడు కూడా అలానే మైదానంలో చెమటలు చిందించాడు. తీవ్రంగా పోరాటం సాగించాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు. అయితే అతడు ఈ స్థాయికి రావడం వెనుక తండ్రి కష్టం బాగుంది. అతడు పడిన త్యాగం వెలకట్టలేనిది.
శ్రీలంక జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం టీం ఇండియాను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ఇందులో సరాంష్ జైన్ అనే ఆటగాడు చోటు సంపాదించుకున్నాడు. ఇతడికి దాదాపు 33 సంవత్సరాలు. ఇతడు హాఫ్ స్పిన్నర్. పైగా వెనుకబడిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. వాస్తవానికి టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్లో సత్తా చూపించాలి. కానీ ఇతడు రెడ్ బాల్ క్రికెట్లో సత్తా చూపించిన తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. అది కూడా 11 సంవత్సరాల నిరీక్షణ తర్వాత..
ఇతడు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడు. పరుగులు సాధించగలడు. వాషింగ్టన్ సుందర్ గాయపడిన నేపథ్యంలో ఇతడికి అవకాశం లభించింది. ఇటీవల టీమిండియా ఏ శ్రీలంకలో పర్యటించింది. ఆ సమయంలో జట్టులో సరాంష్ ఉన్నాడు. శ్రీలంక జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులలో సత్తా చూపించాడు. ముఖ్యంగా రెండవ టెస్టులో అదరగొట్టాడు. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో 70 పరుగులు చేసి.. అజేయంగా నిలిచాడు.
సరాంష్ మధ్యప్రదేశ్ సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు. బ్యాటింగ్లో అదరగొట్టాడు. బౌలింగ్లో సత్తా చూపించాడు.. ఫీల్డింగ్లో దుమ్మురేపాడు. ముఖ్యంగా అత్యంత కట్టుదిట్టగా బౌలింగ్ వేశాడు. ఇతడు ఇండియా ఏ, సెంట్రల్ జోన్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల తరఫున అనేక టోర్నీలలో అదరగొట్టాడు. చివరికి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇక 2014లో అతడు మధ్యప్రదేశ్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. అప్పుడు అతడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆ సమయంలో అతడి తండ్రికి క్యాన్సర్ శస్త్ర చికిత్స జరుగుతుంది. ఆ విషయాన్ని అతడు తండ్రి సరాంష్ కు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఇండియాకు వచ్చిన తర్వాతే ఈ విషయాన్ని చెప్పాడు. దీనిని బట్టి తన కుమారుడి ఆట కోసం.. అతడు క్యాన్సర్ వ్యాధిని కూడా దాచి పెట్టాడు అంటే.. ఎంతటి ప్రేమో అర్థం చేసుకోవచ్చు . జాతీయ జట్టులో చోటు లభించడంతో సరాంష్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులపాటు తమకుమారుడు పడిన కష్టానికి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Happy to see Saransh Jain getting maiden India Call up after consistent performance in domestics throughout the last few years pic.twitter.com/np4yQAAC0g
— AdityaRRaj (@RR_for_LIFE) July 28, 2026