Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రపంచం లోనే అత్యంత విలువైన ఆటగాడు. క్రికెట్లో సచిన్ స్థాయిని అనుభవిస్తున్నవాడు. అతడు ఆడుతుంటే చూసేందుకు వచ్చే ప్రేక్షకులు వేలల్లో ఉంటారు. టీవీల ముందు చూసేవాళ్ళు.. ఫోన్లలో వీక్షించేవారు లక్షలలో ఉంటారు. నేటి కాలంలో అత్యంత ప్రేక్షక ఆదరణ పొందిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు.
పరుగుల చిరుతలాగా వికెట్ల మధ్య వేగంగా దూసుకుపోతుంటాడు. చూస్తుండగానే పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. జట్టు స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో కదిలే విధంగా చేస్తుంటాడు. అందువల్లే విరాట్ కోహ్లీని కోట్లాదిమంది అభిమానులు ఆరాధిస్తూ ఉంటారు. అతడు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు సంచలనం అవుతుంది. అది పెను ప్రకంపనలకు దారితీస్తూ ఉంటుంది.
విరాట్ కోహ్లీని సోషల్ మీడియాలో కోట్లాదిమంది అనుసరిస్తూ ఉంటారు. అతడు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే దానికి కోట్లల్లో చార్జ్ చేస్తూ ఉంటాడు. అయితే విరాట్ కోహ్లీ ఆ మధ్య ఒక జర్మన్ మోడల్ కు లైక్ కొట్టాడు. అధి కాస్త సోషల్ మీడియాలో సంచలనమైంది. దీనిపై విరాట్ కోహ్లీ వివరణ ఇవ్వకపోయినప్పటికీ… రకరకాల ఊహాగానాలు.. కథనాలు పబ్లిష్ అయ్యాయి. కొంతమంది ఏకంగా విరాట్ కోహ్లీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. విలేకరుల ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ జర్మనీ మోడల్ కు డబ్బులు ఆఫర్ చేశారు. విరాట్ కోహ్లీ మీద తప్పుడు వ్యాఖ్యలు చేయాలని ఆమెకు సూచించారు.
ఆ జర్మన్ మోడల్ ఒప్పుకోలేదు. విరాట్ కోహ్లీ తనకు అత్యంత అభిమాన క్రికెటర్ అని.. తన స్వార్థం కోసం ఆయన వ్యక్తిత్వాన్ని నాశనం చేయలేనని ఆమె స్పష్టం చేసింది. అయితే కోహ్లీ ఆమె పోస్టుకు లైక్ కొట్టడం వల్ల ఒక్కసారిగా ఆమె రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెను లక్షల మంది అనుసరిస్తున్నారు. దీంతో ఆర్థికంగా కూడా ఆమె స్థాయి మారిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు ఆమెను సంప్రదిస్తున్నాయి. విరాట్ కోహ్లీ వల్ల తనకు ఈ గుర్తింపు రావడంతో అటువంటి పాడు పని చేయడానికి ఆమె ఒప్పుకోలేదు.
గతంలో కూడా విరాట్ కోహ్లీ వాడే సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆల్ గారిథామ్ సమస్య వల్ల ఇటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అప్పుడు కూడా విరాట్ కోహ్లీ మీద కొంతమంది పని కట్టుకొని నెగటివ్ వార్తలు రాశారు. అయితే విరాట్ కోహ్లీ చివరికి స్పందించారు. సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందని.. అది నా తప్పు కాదని అతడు స్పష్టం చేశాడు. మళ్లీ కూడా ఇప్పుడు ఇలా జరగడంతో విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది కావాలని ఇలా చేస్తున్నారని అర్థమైంది. అయితే దీనిపై విరాట్ కోహ్లీ గనుక సీరియస్ గా దృష్టి పెడితే అసలు దోషాలు ఎవరో తేలే అవకాశం ఉంది.