Homeఎంటర్టైన్మెంట్Naga Vamsi: 'సింగిల్ స్క్రీన్స్ ని చంపేస్తున్నదే ఆ నిర్మాత' అంటూ నిర్మాత నాగవంశీ సంచలన...

Naga Vamsi: ‘సింగిల్ స్క్రీన్స్ ని చంపేస్తున్నదే ఆ నిర్మాత’ అంటూ నిర్మాత నాగవంశీ సంచలన కామెంట్స్..

Naga Vamsi: టాలీవుడ్ లో ఇప్పుడు రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగేలా అనిపిస్తుంది. నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బ్రతకాలంటే , ఎట్టి పరిస్థితిలోనూ కమీషన్ బేసిస్ మీద సినిమాలను నడుపుకోవడానికి ఒప్పందం చేసుకోవాలి, లేదంటే మేము ఈ నెల 29 నుండి తెలంగాణ లో థియేటర్స్ మూసేస్తాము అంటూ నిన్న దిల్ రాజు సోదరుడు శిరీష్ , ఏషియన్ సునీల్ తదితరులు ప్రెస్ మీట్ ని నిర్వహించి ‘పెద్ది’ నిర్మాతలకు స్వీట్ వార్నింగ్ […]

Naga Vamsi: టాలీవుడ్ లో ఇప్పుడు రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగేలా అనిపిస్తుంది. నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బ్రతకాలంటే , ఎట్టి పరిస్థితిలోనూ కమీషన్ బేసిస్ మీద సినిమాలను నడుపుకోవడానికి ఒప్పందం చేసుకోవాలి, లేదంటే మేము ఈ నెల 29 నుండి తెలంగాణ లో థియేటర్స్ మూసేస్తాము అంటూ నిన్న దిల్ రాజు సోదరుడు శిరీష్ , ఏషియన్ సునీల్ తదితరులు ప్రెస్ మీట్ ని నిర్వహించి ‘పెద్ది’ నిర్మాతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘పెద్ది’ మూవీ నైజాం ప్రాంతం థియేట్రికల్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దాదాపుగా 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సినిమాకు ఇప్పుడు పెద్ద సమస్యలు ఎదురయ్యేలా లాగానే కనిపిస్తున్నాయి. దిల్ రాజు మరియు ఏషియన్ సునీల్ థియేటర్స్ లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక నేడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరుపున కూడా ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవి శంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత నాగవంశీ , సాహు గారపాటి తదితరులు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో నాగవంశీ ఏషియన్ సునీల్ పై చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నిన్న ఒక టాప్ ఎక్సిభిటర్ ప్రెస్ మీట్ లో సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయి అంటూ మాట్లాడినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది. ఖాళీ స్థలం దొరికితే మల్టీప్లెక్స్ ని నిర్మించి , సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతుండడానికి కారణం అవుతున్న ఆయన అలా బాధ పడుతూ మాట్లాడడం హాస్యాస్పదం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మూసాపేట ఒక మల్టీప్లెక్స్ థియేటర్ ని రీసెంట్ గానే రీ మోడలింగ్ చేశారు. కానీ దాని ఎదురుగా ఉన్న ఒక టాప్ సింగిల్ స్క్రీన్ ని పట్టించుకోవడం లేదు , కుప్ప తొట్టి లాగా మార్చేశారు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ.

కమీషన్ బేసిస్ మీద సినిమాలను రన్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని , కానీ మేము ఇచ్ 40 శాతం కమీషన్ కి వచ్చే గ్రాస్ లో పారదర్శకత ఉండాలని , అందుకు రెంటార్క్ సిస్టం ని తీసుకొని రావాలని , అప్పుడే మాకు ఎంత గ్రాస్ వస్తుంది , ఎంత మేము కమీషన్ ఇవ్వాలి అనే దానిపై క్లారిటీ వస్తుందని , ఆ సిస్టం వచ్చేంత వరకు మేము కమీషన్ బేసిస్ మీద సినిమాలను నడిపేందుకు ఒప్పుకోమని నాగవంశీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. వీళ్ళు చేస్తున్న ఈ రచ్చ వల్ల రేపు నష్టపోయే మొదటి సినిమా పెద్ది నే, అప్పుడు మేము చిరంజీవి , రామ్ చరణ్ గార్ల దగ్గరకు వెళ్లి, జరుగుతున్న విషయాలను వివరించడమే ఇక మిగిలింది అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper