Homeక్రీడలుVirat Kohli viral video : అంతటి విరాట్ కోహ్లీ అతడిని చూసి ఆగిపోయాడు.. అతడు...

Virat Kohli viral video : అంతటి విరాట్ కోహ్లీ అతడిని చూసి ఆగిపోయాడు.. అతడు అడిగింది చేసి వెళ్ళాడు.. వైరల్ వీడియో

Virat Kohli viral video : విరాట్ కోహ్లీ.. టీమిండియాలో ఒక సమ్మోహన శక్తి. బ్యాటింగ్ బాగా చేస్తాడు. ఫీల్డింగ్ అదరగొడతాడు. మైదానంలో ఆవేశంగా ఉంటాడు. రెచ్చగొడితే రెచ్చిపోతాడు. గెలికితే వెంటపడి ఇబ్బంది పడతాడు. సమకాలీన క్రికెట్లో అతడు ఒక అగ్గి బరాట. అందువల్ల విరాట్ కోహ్లీ జోలికి వెళ్లాలంటే మిగతా ప్లేయర్లు భయపడతారు. చివరికి ఇండియన్ ప్లేయర్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు.

విరాట్ కోహ్లీలో కోపం మాత్రమే కాదు శాంతం కూడా ఉంటుంది. అతడు ప్రశాంతంగా ఉంటే మంచి మంచి విషయాలు చెబుతాడు. యంగ్ ప్లేయర్లకు సలహాలిస్తుంటాడు. అవసరమైతే క్రికెట్ బ్యాట్లు.. బూట్లు పంపిస్తుంటాడు. విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా.. ఆతిథ్య రంగంలోకి కూడా అడుగు పెట్టాడు. అతడికి రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటి కాలంలో క్రికెట్లో విరాట్ కోహ్లీతో సోషల్ మీడియాలో పోటీపడే మరో ఆటగాడు లేడు అంటే అతడి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

విరాట్ కోహ్లీకి అభిమానుల దళం అధికంగా ఉంటుంది. అతడిలాగా ఆడాలని.. అతడి మాదిరిగా అగ్రిసివ్ గా ఉండాలని చాలామంది అనుకుంటారు. యూత్ విరాట్ కోహ్లీని ఒక ఐకాన్ లాగా భావిస్తుంటారు. అతనితో ఫోటోలు దిగాలని.. ఆటోగ్రాఫ్ లు తీసుకోవాలని భావిస్తుంటారు. కాకపోతే విరాట్ కోహ్లీతో ఫోటోలు దిగడం.. ఆటోగ్రాఫ్ లు తీసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అతడి చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మైదానంలో కంచెలు బద్దలు కొడితే తప్ప అతడిని చేరుకోవడం కష్టం. ఒకవేళ చేరుకున్న సరే.. సెక్యూరిటీ సిబ్బంది చేతిలో దెబ్బలు తినాల్సిందే.

ఇటీవల విరాట్ కోహ్లీ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ ఆడేందుకు ఉప్పల్ వచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత.. తోటి ప్లేయర్లతో కలిసి జట్టు బస్సులో బయలుదేరడానికి వెళ్ళాడు. అయితే విరాట్ కోహ్లీ కోసం ఒక బాలుడు తన కుటుంబంతో అక్కడ ఎదురు చూస్తున్నాడు. విరాట్ కోహ్లీ రాగానే ఒకసారిగా ఉద్వేగానికి గురయ్యాడు. ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ విరాట్ కోహ్లీని కోరాడు. సెక్యూరిటీ సిబ్బంది ఆ బాలుడిని వద్దని వారించారు. ఆ బాలుడి తాపత్రయాన్ని చూసిన విరాట్ కోహ్లీ సెక్యూరిటీ సిబ్బందిని ఆపాడు. ఆ బాలుడిని తన వద్దకు రమ్మని పిలిచాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. తన అభిమాన ఆటగాడిని చూశాను అనే ఆనందంలో ఆ బాలుడు విరాట్ కోహ్లీ కాళ్లకు నమస్కరించాడు. విరాట్ కోహ్లీ కూడా ప్రతి నమస్కారం చేశాడు. దీంతో ఆ బాలుడి ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular