Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli T20 World Cup: విరాట్ కోహ్లీ వచ్చేసాడు.. టి20 వరల్డ్ కప్ లో...

Virat Kohli T20 World Cup: విరాట్ కోహ్లీ వచ్చేసాడు.. టి20 వరల్డ్ కప్ లో ఆడతాడా ఏంటి?

Virat Kohli T20 World Cup: టీమిండియాలో విరాట్ కోహ్లీ గురించి ఎన్ని రకాలుగా చెప్పినా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే టీమిండియాలో విరాట్ కోహ్లీ సృష్టించిన సంచలనాలు అటువంటివి మరి. బ్యాటింగ్ ద్వారా అతడు నెలకొల్పిన ఘనతలు మామూలువి కావు. సారధిగా విరాట్ కోహ్లీ.. ఆటగాడిగా విరాట్ కోహ్లీ అన్ని విధాలు వీరోచితమైన ఆట తీరును ప్రదర్శించాడు. అందువల్ల విరాట్ కోహ్లీ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు.

మనదేశంలో సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ టి20 లకు, టెస్ట్ ఫార్మాట్ లకు దూరమయ్యాడు. 2024 జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీం ఇండియాను విజేతగా నిలిపిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. గత ఏ డాది టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా దూరం జరిగాడు. ఇప్పుడు కేవలం వన్డేలలో మాత్రమే అతడు కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో 2027 వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకొని విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్ జట్లతో జరిగిన వన్డే సిరీస్ లలో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సచిన్ అధిగమించి సరికొత్త రికార్డులను సృష్టించాడు.

కింగ్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్లో నివాసం ఉంటున్నాడు. మ్యాచులు ఉన్నప్పుడు మాత్రమే ఇండియాకు వస్తున్నాడు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఇండియాకు వచ్చాడు. టీమిండియా వేదికగా ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ జరుగుతోంది. టి20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో అతడు ఇండియాకు రావడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది అభిమానులు విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ లో ఆడితే బాగుండని వ్యాఖ్యానిస్తున్నారు. అతడు ఆడితే పూనకం వస్తుందని పేర్కొంటున్నారు. అయితే విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత అందులో ఆడే అవకాశం లేదని మరికొంతమంది అభిమానులు అంటున్నారు. విమానాశ్రయం నుంచి విరాట్ కోహ్లీ బయటికి వస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
AP Local Body Elections

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...
AP BJP

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...
AP Government Door To Door Campaign

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Oktelugu Epaper