Virat Kohli: నేటి కాలంలో యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే పెయిడ్ సంస్థలను సంప్రదించాలి.. అవసరమైతే అడ్డదారులు తొక్కాలి. యూట్యూబ్లో వ్యూస్ రప్పించడానికి చాలా వరకు సంస్థలు ఏర్పాటు అయ్యాయి.. ఒకరకంగా యూట్యూబ్ అంటేనే పెద్ద దందా.. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారు పబ్లిసిటీ కోసం, వ్యూస్ కోసం కృత్రిమ తత్వాన్ని అవలంబిస్తుంటారు.
కొందరికి యూట్యూబ్ లో వ్యూస్ సంపాదించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. జస్ట్ వాళ్లు ఒక్క వీడియో చేస్తే చాలు యూట్యూబ్ మొత్తం షేక్ అవుతుంది. చూస్తుండగానే లక్షల్లో వ్యూస్ లభిస్తుంటాయి.. ఇక ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా యూట్యూబ్ ను షేక్ చేసే సత్తా ఉన్న వారిలో విరాట్ కోహ్లీ ముందు వరసలో ఉంటాడు.. ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్లో అత్యధికమంది ఫాలోవర్స్ కలిగి ఉన్న సెలబ్రిటీలలో విరాట్ మొదటి వరుసలో ఉంటాడు.
విరాట్ కోహ్లీ యూట్యూబ్లో అరుదుగా వీడియోలు పెడుతుంటాడు.. తాను ప్రమోషన్ చేసే కంపెనీల వీడియో లు కూడా అందులో పోస్ట్ చేస్తుంటాడు.. విరాట్ ఎలాంటి వీడియో పెట్టినా సరే అభిమానులు బ్రహ్మరథం పడుతుంటారు.. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, అర్షదీప్ సింగ్ ఒక వీడియో రూపొందించారు. అందులో విరాట్ ను ఉద్దేశించి ” పాజీ పరుగులు తక్కువయ్యాయి. లేకపోతేనే సెంచరీ అయ్యేది అని” అర్షదీప్ పేర్కొన్నాడు. ” ఒకవేళ టాస్ గెలవకపోతే ఈ డ్యూ కి నీ బౌలింగ్లో సెంచరీ నమోదయ్యేదని” విరాట్ వ్యాఖ్యానించాడు.. అయితే ఈ వీడియో ఇప్పటికి ట్రెండింగ్ లోనే ఉంది.. మిలియన్లకు మించి వ్యూస్ దక్కించుకొని సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.
విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా సిరీస్ లో మరోసారి అదరగొట్టాడు. రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ తో దుమ్ము రేపాడు. ఈ సిరీస్ లోనే హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసి, తన బ్యాట్ లో వేడి తగ్గలేదని నిరూపించాడు. బౌలర్ల మీద పరాక్రమాన్ని ప్రదర్శించి తన స్థాయి ఏమిటో మరోసారి నిరూపించాడు.
Arshdeep Singh to Virat Kohli – Paaji run km Rah gye century pakki thi.
Than Virat Kohli to Arshdeep Singh- Toss jeet gye nhi toh teri bhi pakki thi. pic.twitter.com/LiZRNwwnEv
— Rohit Sharma Fan (@hitmanfanfollow) December 6, 2025