Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli - Rohith Sharma : దేశం వదిలేసి విదేశాలకు వెళ్లిపోతున్న విరాట్ కోహ్లీ,...

Virat Kohli – Rohith Sharma : దేశం వదిలేసి విదేశాలకు వెళ్లిపోతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లకు ఏమైందసలు?

Virat Kohli – Rohith Sharma : మనదేశంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. అందుకే ఈ ఇద్దరు క్రికెటర్లు మన దేశంలో కంటే విదేశాలకు వెళ్లేందుకు మక్కువ చూపిస్తున్నారు. సిరీస్ లో ఏదైనా గ్యాప్ దొరికితే చాలు వెంటనే కుటుంబాలతో కలిసి వెకేషన్ కి వెళ్తున్నారు.. అయితే చాలామంది ఇది కేవలం నార్మల్ ట్రిప్ అని మాత్రమే అనుకున్నారు. కానీ దాని వెనుక చాలా తతంగం ఉందని, ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు భారీ స్కెచ్ వేశారని నేషనల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఇటీవల టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ టి20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. విరాట్ కోహ్లీ కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం 35+ సంవత్సరాలకు మించి వయసు ఉన్న ఈ ఇద్దరు క్రికెటర్లు వన్డే, టెస్ట్ క్రికెట్ కూడా ఎక్కువకాలం ఆడకపోవచ్చని తెలుస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ తర్వాత.. ఆ రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలకవచ్చని సమాచారం. ఆ తర్వాత ఈ ఇద్దరు క్రికెటర్లు ఇతర ప్రాంతాలలో స్థిరపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

లండన్ వెళ్లి వస్తున్నాడు

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కుటుంబంతో లండన్ లో స్థిరపడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇదే విషయానికి సంబంధించి వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై అటు విరాట్ ఇటు అనుష్క ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. విరాట్ జంట వామిక తర్వాత అకాయ్ అనే బాబుకు జన్మనిచ్చారు. అయితే ఆకాయ్ లండన్లో జన్మించాడు. అనుష్క డెలివరీ సమయంలో కోహ్లీ లండన్ లోనే ఉన్నాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే కీలకమైన సిరీస్లో అతడు ఆడలేదు. ఇక అప్పటినుంచి ఈ జంట లండన్లో స్థిరపడేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని పుకార్లు వినిపించాయి. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, విక్టరీ పరేడ్ లో పాల్గొన్న అనంతరం అనుష్క పిల్లలు వామిక, అకాయ్ తో కలిసి విరాట్ లండన్ వెళ్లిపోయాడు. ఇప్పుడు మాత్రమే కాదు అనుష్క – విరాట్ ఈమధ్య తరచూ లండన్లో కనిపిస్తున్నారు. రెస్టారెంట్లో తింటూనో, అక్కడ షాపింగ్ చేస్తూనో కెమెరాలకు చిక్కుతున్నారు. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు.

అతడు పుట్టకముందే

అకాయ్ పుట్టకముందే అనుష్క – విరాట్ లండన్ లో ఎక్కువ కాలం ఉన్నారు.. అనుష్క గర్భవతిగా ఉన్నప్పుడు అక్కడే ప్రసవించాలని భావించారు.. అకాయ్ రూపంలో వారికి బాబు పుట్టిన తర్వాత విరాట్ జంట లండన్ లో దాదాపు రెండు నెలలపాటు ఉన్నారు. ఐపీఎల్ కోసం విరాట్ తిరిగి ఇండియాకు వచ్చాడు. అతడు వచ్చిన చాలా రోజులకు అనుష్క ఇండియాలో అడుగు పెట్టింది. అప్పట్లోనే కోహ్లీ లండన్ లో శాశ్వతంగా స్థిరపడేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాడని, అందువల్లే అనుష్క ఆలస్యంగా ఇండియాలోకి అడుగుపెట్టిందని వార్తలు వినిపించాయి.

న్యూయార్క్ లో రోహిత్

విరాట్ లండన్లో స్థిరపడితే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ న్యూయార్క్ లో స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం రోహిత్ అతి త్వరలో స్వదేశాన్ని వదిలి వెళ్ళేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. రోహిత్ న్యూయార్క్ లో ఇల్లు కొనేందుకు ప్రణాళికల రూపొందించుకుంటున్నాడని తెలుస్తోంది. ఇటీవల అతడు తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ లో గడిపాడు. పలు ప్రాంతాలను సందర్శించాడు. అయితే ఈ టూర్ ను సాధారణంగా జరిగేదనని అందరూ అనుకున్నారు. కానీ దాని వెనుక అంతరార్థం వేరే ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు రోహిత్ అధికారికంగా ఎటువంటీ ప్రకటన చేయలేదు.

అందువల్లే..

విరాట్, రోహిత్ లండన్, న్యూయార్క్ లో సెటిల్ అయ్యేందుకు ప్రధాన కారణం.. పబ్లిక్ లైఫ్ ను ఎంజాయ్ చేయడమే. ఎందుకంటే స్వదేశంలో వారికి ఈ అవకాశం లేదు. బయటికి వెళితే అభిమానులు చుట్టుముడుతున్నారు. ఫోటోలు తీసుకునేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా స్టార్ క్రికెటర్లకు ఇబ్బందికరంగా మారింది. కుటుంబంతో కలిసి షాపింగ్ చేసేందుకు, రెస్టారెంట్లో సరదాగా తినేందుకు విదేశాలే అనుకూలమని వారు భావిస్తున్నారు. అందువల్లే వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్ కు వెళ్తున్నారు. అందువల్లే విదేశాలకు వెళ్తున్నారు.. ఈ కారణాలే విరాట్ – రోహిత్ శర్మ లండన్, న్యూయార్క్ లో సెటిల్ అయ్యేందుకు దోహదం చేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిల్లో ఎంతవరకు నిజం ఉందనేది విరాట్- రోహిత్ నోరు విప్పితేనే తెలుస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular