Nara Lokesh In London: ఏపీకి( Andhra Pradesh) పెట్టుబడులు తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తరచూ విదేశాల్లో పర్యటిస్తూ దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. ఇలా కలిసే క్రమంలో చాలామంది పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నారా లోకేష్ లండన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో పెట్టుబడి పెట్టబోయే పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించేందుకు మాత్రమే నారా లోకేష్ లండన్ పర్యటన కొనసాగుతోంది. మరోవైపు తన పర్యటన విజయవంతంగా జరుగుతున్నట్టు నారా లోకేష్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. లోకేష్ పర్యటన ఆంధ్రప్రదేశ్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
* విశాఖ సమ్మిట్ కు ప్రచారంగా.. విశాఖలో( Visakhapatnam) త్వరలో ఏపీ ప్రభుత్వం పార్టనర్షిప్ సమ్మిట్-2025 నిర్వహిస్తోంది. నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ఈ సమ్మిట్ కు సంబంధించి లండన్ లో లోకేష్ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సమ్మిట్ ను భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఏపీ ప్రభుత్వం, కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. లండన్ లో పెట్టుబడుదారులను ఆకర్షించేందుకుగాను సుమారు 150 మంది పెట్టుబడిదారులతో ఈ రోడ్ షో కొనసాగనుంది. ముఖ్యంగా లోకేష్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, ఫిన్ టెక్, ఫార్మా, హెల్త్ కేర్, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడ్ టక్ వంటి రంగాలపై దృష్టి పెట్టారు. ఈ రంగాలలో ఏపీలో ఉన్న అవకాశాలను వివరించే ప్రయత్నం చేశారు.
* విజయవంతంగా..
లోకేష్( Nara Lokesh) లండన్ పర్యటన విజయవంతంగా జరుగుతోంది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు విజన్, డిజిటల్ గవర్నెన్స్, ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానాలను అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. ఈ రోడ్డు షో ద్వారా పెట్టుబడులను ఆకర్షించి.. కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్నదే లోకేష్ లక్ష్యంగా కనిపిస్తోంది. గత ఏడాది అమెరికాలో పర్యటించారు నరా లోకేష్. శాన్ ఫ్రాన్సిస్కో లో కూడా ఇలాంటి ప్రచారాలు నిర్వహించారు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శాంతను నారాయణన్ తో సమావేశం అయ్యారు. దీంతో కొన్ని సంస్థలు ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధపడ్డాయి. ఆ మధ్యన లోకేష్ సీఎం చంద్రబాబు తో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా లండన్ పర్యటన ఏపీకి గేమ్ చేంజర్ అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Delighted to be addressing a
discussion with senior business leaders in London pitching for investments to #AndhraPradesh. My team tells me that the cumulative net worth of the corporates in the room is $170 billion! #InvestInAP pic.twitter.com/1uee6MuF0S— Lokesh Nara (@naralokesh) September 16, 2025