Rohit Sharma London: టీమిండియా వన్డే సారధి రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం అతడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమ్ ఇండియాకు సారధిగా ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ ఫార్మాట్ కు సారధిగా గిల్ కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్లో అతడు ఏకంగా 700+ పరుగులు చేసి.. అదరగొడుతున్నాడు.. ఇంగ్లాండ్ జట్టుపై ఐదు టెస్టుల సిరీస్ లో అద్భుతమైన పోటీ ఇస్తున్నాడు.. ఇప్పటివరకు టీమిండియా ఈ సిరీస్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది. లండన్ ఓవల్ మైదానంలో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
Also Read: సిక్స్ కొట్టగానే అమ్మాయిలను ఎందుకు చూపిస్తారంటే..
ప్రస్తుతం జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో లాబీలో రోహిత్ శర్మ కనిపించాడు. రోహిత్ శర్మ లాబీలో కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అంతకుముందు అతడు గేట్ పాస్ తో లోపలికి వస్తున్న దృశ్యాలను కూడా జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్, స్కై స్పోర్ట్స్ చానల్స్ చూపించాయి. రోహిత్ నలుపు రంగు టీ షర్ట్, నెత్తికి క్యాప్, బ్రౌన్ కలర్ ప్యాంటు ధరించి కనిపించాడు. రోహిత్ లాబీలో ఉన్న దృశ్యాలను టెలికాస్ట్ చేయగానే మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. రోహిత్ రోహిత్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్న రోహిత్.. చాలా రోజుల వరకు బయటకు కనిపించలేదు. పైగా అతడు కుటుంబానికి పరిమితమయ్యాడు. మధ్య మధ్యలో తన భార్యతో కలిసి కొన్ని వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించాడు. అయితే రోహిత్ ఇప్పుడు ఉన్నట్టుండి లండన్ వెళ్లడం.. అక్కడి లాబీలో కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే రోహిత్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? టెస్ట్ ఫార్మేట్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాడా? లేదా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాడా? అనే ప్రశ్నలు మీడియాలో విడిపిస్తున్నాయి. అయితే అతడి అభిమానులు మాత్రం జట్టుకు సపోర్ట్ చేయడానికి మాత్రమే వెళ్ళాడని అంటున్నారు.
లండన్ ఓవల్ మైదానంలో సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం రోహిత్ శర్మ ఇంగ్లీష్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో అదరగొట్టాడు. ఇదే మైదానంలో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.. అప్పట్లో అద్భుతమైన నాక్ ఆడి అదరగొట్టాడు. ఇప్పటికి అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్ ను కథలు కథలుగా చెప్పుకుంటారు.. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ ఇదే మైదానంలో టీమిండియా ఇంగ్లీష్ జట్టుతో ఆడుతోంది. గెలుపు దిశగా సాగుతోంది. సమయంలో రోహిత్ శర్మ కనిపించడంతో అతని అభిమానుల ఆనందానికి అవధి లేకుండా పోయింది.
ROHIT SHARMA HAS ARRIVED AT THE OVAL TO SUPPORT TEAM INDIA. pic.twitter.com/kmo3O9bRjl
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 2, 2025