Yuvraj Singh: అది 2011.. వరల్డ్ కప్ ఫైనల్.. దేశ ఆర్థిక రాజధాని వేదికగా భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. భారత్ లక్ష్యాన్ని చేదిస్తోంది. ఇందులో భాగంగానే యువరాజ్ బ్యాటింగ్ కు వచ్చాడు. కొంతవరకు స్వేచ్ఛ గానే బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మైదానంలో వాంతి కూడా చేసుకున్నాడు. ఆ వాంతిలో రక్తం పడింది. అప్పట్లో దానిని ఎవరూ పెద్దగా గుర్తించలేదు. భారత్ గెలిచింది. వరల్డ్ కప్ అందుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి యువరాజ్ లండన్ లో కనిపించాడు. అసలు అతనికి ఏమైంది? ఎందుకు లండన్ వెళ్లిపోయాడు? అనే చర్చ జరిగింది.
Also Read: నాలుగు రోజులకోసారి రంగు వేసుకుంటున్నాను.. విరాట్ భయ్యా.. ఈ మాటలు తగలాల్సిన వాళ్ల కు తగిలాయి అంతే!
వాస్తవానికి యువరాజ్ ఆరోగ్యంగా ఉంటాడు. శారీరక సామర్థ్యం విషయంలో సరికొత్త ప్రమాణాలను పాటిస్తాడు. అందువల్లే అతడు మైదానంలో అత్యంత చురుకుగా ఉంటాడు. బ్యాటింగ్ ఎంత వేగంగా అయితే చేస్తాడో.. బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో కూడా అంతే వేగాన్ని ప్రదర్శిస్తాడు. అటువంటి యువరాజ్ క్యాన్సర్ బారినపడటంతో అతని జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. వాస్తవానికి నాటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో అతడు రక్తపు వాంతులు చేసుకోవడానికి కారణం క్యాన్సర్. అప్పుడు అతడికి ఆ వ్యాధి ప్రారంభ దశలో ఉంది. ముందుగానే గుర్తించిన అతడు అధునాతన చికిత్స కోసం లండన్ వెళ్లాడు. అక్కడ చికిత్స చేయించుకొని తిరిగి ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత యువరాజ్ ఒక్కసారిగా మారిపోయాడు. అంతేకాదు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ క్యాన్సర్ రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాడు. తన మాటల ద్వారా ఇప్పటివరకు ఆ పని చేసిన అతడు.. ఇప్పుడు చేతల్లో కూడా చూపిస్తున్నాడు.
సాధారణంగా సమాజం అంటే యువరాజ్ కు చాలా ఇష్టం. మనుషులను ప్రేమించడం అంటే అతడికి మరింత ఇష్టం. క్యాన్సర్ వ్యాధిని చేయించిన తర్వాత.. క్యాన్సర్ రోగుల కోసం ఏదైనా చేయాలని యువరాజ్ నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే you we can అనే చారిటీని ఏర్పాటు చేశాడు. దానికోసం బుధవారం లండన్లో ఒక కార్యక్రమం నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి సచిన్, విరాట్, అజిత్ అగర్కర్, రవి శాస్త్రి, కెవిన్ పీటర్సన్ వంటి వారు హాజరయ్యారు. అయితే ఈ చారిటీలో సేకరించిన నిధులను క్యాన్సర్ రోగుల చికిత్స కోసం యు వి కెన్ ఫౌండేషన్ వాడుతుంది. క్యాన్సర్ రోగులకు చికిత్సకు.. ఇతర సదుపాయాల కోసం ఈ డబ్బులు ఖర్చు పెడతారు. అయితే కార్యక్రమాన్ని ఎప్పటినుంచో చేపట్టాలని యువరాజ్ అనుకుంటున్నాడు. చివరికి ఇన్ని రోజులకు ఇది కార్యరూపం దాల్చింది. యువరాజ్ చారిటీ చేపట్టిన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. యువరాజ్ చేస్తున్న ఈ పనిని కొనియాడింది.
లండన్ లో చికిత్స తీసుకున్నప్పుడు యువరాజ్ చాలా ఇబ్బందులు పడ్డాడు. కొన్ని సందర్భాలలో పూర్తి నిరాశలో కూరుకుపోయాడు. ఆ తర్వాత తనకు తాను ధైర్యం తెచ్చుకొని సానుకూల దృక్పథంలోకి వచ్చేశాడు. ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా జయించి.. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఆవిర్భవించాడు. తను పడిన బాధలు మిగతావారు పడకూడదని.. తాను ఎదుర్కొన్న కష్టాలు మిగతావారు చవిచూడకూడదని భావించి యువరాజ్ ఈ చారిటీకి శ్రీకారం చుట్టాడు. మరోవైపు యువరాజ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీమిండియా మొత్తం హాజరైంది.. ఈ కార్యక్రమానికి ధోని హాజరు కాకపోవడం పట్ల చర్చ మొదలైంది. ఇటీవల యువరాజ్ తండ్రి ధోని మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ యూ ట్యూబర్ ఇంటర్వ్యూలో యువరాజ్ తనకు ధోనితో గొప్ప స్నేహం లేదని వ్యాఖ్యానించిన విషయం కూడా తెలిసిందే. అందువల్లే ధోనికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేదని తెలుస్తోంది.