Homeప్రవాస భారతీయులుTANA : న్యూయార్క్‌లో తానా బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమం.. విద్యార్థులకు స్కూల్‌ బ్యాగుల పంపిణీ

TANA : న్యూయార్క్‌లో తానా బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమం.. విద్యార్థులకు స్కూల్‌ బ్యాగుల పంపిణీ

TANA : న్యూయార్క్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో Wyandanch యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్ లోని విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు, విద్యాసామగ్రి పంపిణీ చేయబడింది. రాజా కసుకుర్తి ఉదార మద్దతుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. తానా అధ్యక్షులు నరేన్ కొడాలి నాయకత్వంలో, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల కోసం సేవ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని […]

TANA : న్యూయార్క్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో Wyandanch యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్ లోని విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు, విద్యాసామగ్రి పంపిణీ చేయబడింది. రాజా కసుకుర్తి ఉదార మద్దతుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది విద్యార్థులు లబ్ధి పొందారు.

తానా అధ్యక్షులు నరేన్ కొడాలి నాయకత్వంలో, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల కోసం సేవ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తానా ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తానా న్యూయార్క్‌ ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ భర్తవరపు స్కూల్‌ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమ విజయానికి సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, దిలీప్‌ ముసునూరు, ప్రసాద్‌ కోయి, శ్రీనివాస్‌ నాదెళ్ల కీలకంగా కృషి చేశారు.

అలాగే తానా కిడ్స్‌ సుధీక్ష ముసునూరు, సుహాస్ ముసునూరు, సమన్విత మిన్నెకంటి, ఆశ్రిత కోయి, శరన్ సాయి భర్తవరపు, గీతికా చల్ల, రజిత్ రెడ్డి, రమ్యరెడ్డి, లోహితాక్ష సాయి నాదెళ్ల ఈ సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తోడ్పాటు అందించారు.

కార్యక్రమానికి విచ్చేసిన కమ్యూనిటీ లీడర్ ప్రసాద్ కంభంపాటి తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అలాగే Wyandanch యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అఫ్ స్కూల్స్‌, స్థానిక అధికారులు, టీచర్లు మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమం కోసం తానా చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం అన్నారు.

తమ స్కూల్‌ను ఎంపిక చేసి విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు అందజేసినందుకు తానా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్యాగులు అందుకున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper