Vaibhav Suryavanshi Captain: సరిగ్గా మూతి మీద మీసాలు కూడా రాలేదు. గట్టిగా చెప్పాలంటే స్కూల్ విద్య కూడా పూర్తి కాలేదు. కానీ అతడికి అవకాశాలు ప్రవాహం లాగా వస్తున్నాయి. అలాగని అతడేమి వైల్డ్ కార్డు ఎంట్రీ ఆటగాడు కాదు. వెనకాల గట్టి బ్యాగ్రౌండ్ ఉన్న ప్లేయర్ కూడా కాదు. జస్ట్ 16 సంవత్సరాల వయసు ఉన్న బుడతడు. బ్యాట్ పట్టుకుంటే బంతి బద్దలు కావాల్సిందే. గట్టిగా నిలబడితే బౌలర్ వణికి పోవాల్సిందే. ఒకరకంగా పెద్ది స్టైల్ లో ఆడుతున్నాడు. చిన్న వయసులోనే పెద్దిగా నిలబడుతున్నాడు.
ఈ ఉపోద్ఘాతం చదివిన తర్వాత మీకు వైభవ్ సూర్య వంశీ కళ్ళ ముందు కనిపిస్తే తప్పు మాది కాదు. ఎందుకంటే అతడి గురించి రాసి రాసి ఉపమానాలు లేకుండా పోయాయి. అతని ఆట తీరి గురించి వర్ణించి వర్ణించి ఉపోద్ఘాతాలు తగ్గిపోయాయి. ఇలా ఎన్ని రాసినా సరే.. రాయక పోయినా సరే వైభవ్ సూర్య వంశీ టీమ్ ఇండియా క్రికెట్లో ఒక బెంచ్ మార్క్. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అతిశయోక్తి అంతకంటే లేదు. సాలిడ్ ఆట తీరుకు నిలువెత్తు నిదర్శనం సూర్యవంశీ. అందువల్లే అతడి చేతిలో భారత క్రికెట్ భద్రంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు.. మాజీ క్రికెటర్లు అంటున్నారు. వాళ్ల పొగడ్తలను కాస్త పక్కన పెడితే.. ఇప్పుడు వైభవ్ సూర్య వంశీ అనుకున్నది సాధించాడు. టీమిండియాలోకి తాను ఆడేందుకు రాలేదని.. ఏకంగా ఏలేయడానికి వచ్చానని నిరూపించాడు.
వైభవ్ సూర్య వంశీ సారధిగా మారిపోయాడు. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జరుగుతున్న మ్యాచ్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ కిషన్ గాయపడ్డాడు. దీంతో అతడు మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో బేబీ బాస్ సూర్యవంశీ నాయకత్వ బాధ్యతలు అందుకోబోతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో అతడు జట్టును లీడ్ చేయడం ఇదే తొలిసారి. కెప్టెన్సీ అందుకోగానే సూర్య వంశీ ఒక నవ్వు నవ్వాడు. అయితే శమీ.. ముఖేష్ కుమార్ లాంటి సీనియర్ ప్లేయర్లను సూర్య వంశీ హేండిల్ చేయడం ఆసక్తికరంగా ఉంది. “వైభవ్ చూస్తుండగానే ఎదిగిపోతున్నాడు. ఏకంగా అతడు జట్టుకు సారథిగా మారిపోయాడు. ఈ రికార్డును ఈ తరంలో ఏ ఆటగాడు కూడా సృష్టించలేడు. ఎందుకంటే సూర్య వంశీ ఆట తీరు అలా ఉంది మరి. అతడు వైట్ బాల్ ఫార్మాట్లో మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు రెడ్ బాల్ ఫార్మాట్లో కూడా సహనానికి సిసలైన నిదర్శనంగా ఆడితే అతడికి తిరుగుండదు. బహుశా అందుకోసమే మేనేజ్మెంట్ అతడిని డొమెస్టిక్ క్రికెట్ కోసం ఎంపిక చేసి ఉంటుంది. ఇందులో గనుక అతడు తన ప్రతిభను నిరూపించుకుంటే.. కచ్చితంగా ఎరుపు రంగు బంతి ఫార్మాట్లో ఆడతాడని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.