Anaya Bangar: పుట్టగానే బాలుడిగా జన్మించాడు. ఆ తర్వాత శరీరంలో మార్పులు గమనించాడు. తను అతడిని కాదని.. ఆమెను అని గుర్తించాడు. అనంతరం అతడి కంటే ఆమెగా మారడమే తనకు మంచిదని నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యులకు చెప్పాడు కొద్దిరోజులు చర్చలు జరిగాయి. ఆ తర్వాత అతని నుంచి ఆమెగా మారిపోయాడు.
ఆమెగా మారిన అతడు మరెవరో కాదు మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు. మొదట్లో ఇతడు పురుషుడిగాను జన్మించాడు. ఆ తర్వాత అతడి శరీరంలో మార్పులు చోటు చేసుకోవడంతో శస్త్ర చికిత్సలు చేయించుకొని స్త్రీగా మారిపోయాడు. ఇప్పుడు అతని పేరు అనయా బంగర్. ఇప్పుడు అనయా ప్రపంచ మహిళల క్రికెట్లో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారిపోయింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో ఆడేందుకు ఇటీవల ఆమెకు అనుమతి లభించింది. అయితే ఇది కాస్త వివాదంగా మారింది. ట్రాన్స్ జెండర్ ల కు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తీసుకుని నిర్ణయం అదనపు ప్రయోజనం చేకూర్చుతోందా అనే విషయం పైన చర్చ మొదలైంది. క్రికెట్ ఆస్ట్రేలియా అనయా బంగర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ మారిజాన్ తీవ్రంగా విమర్శించారు. ఒక ట్రాన్స్ జెండర్ కి మహిళల క్రికెట్లో అవకాశం ఎలా కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం పూర్తిగా హాస్యాస్పదమైనదని కాప్ అభివర్ణించారు.. మహిళా క్రికెట్లో ఆడేందుకు అనయా ను ఎలా అనుమతిస్తారని ఆమె ప్రశ్నించారు. కాప్ చేసిన వ్యాఖ్యలు మహిళా క్రికెట్లో ట్రాన్స్ జెండర్ల భాగస్వామ్యం.. సమానత్వం పై విస్తృతమైన చర్చకు దారితీసాయి.
దీనిపై అనయా కూడా గట్టిగానే స్పందించింది..”నా రాకను వ్యతిరేకిస్తున్న వారు తీర్పులు చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా ఆట మీద అవగాహన పెంచుకోవాలి. మనుషుల మీద ప్రేమను వ్యక్తం చేయాలి. అనవసరమైన వివాదాలను సృష్టించి లబ్ధి పొందాలని కోరుకోకూడదు. అనేక రకాల పరీక్షలు.. విస్తృతమైన మదింపుల తర్వాతే నా అర్హతను నిర్ణయించారు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తర్వాత ఓ యూనివర్సిటీతో కలిసి నిర్వహించిన 12 వారాల మదింపులో.. తన శారీరక పరిమితులు మహిళ క్రికెటర్లలో కనిపించే పరిధిలోనే ఉన్నాయని చెప్పారు. నా కండరాల పరిమాణం.. స్టామినా.. టెస్టోస్టిరాన్ స్థాయిలో కూడా మార్పులు వచ్చాయని” అనయా వివరించింది.
అనేక రకాల పరీక్షల తర్వాతనే అనయా కు క్రికెట్ ఆస్ట్రేలియా ఆడేందుకు అనుమతి ఇచ్చింది. తద్వారా ఆమెకు మహిళల క్రికెట్ వైపు ఒక వినూత్నమైన మార్గం ఏర్పడింది. ఈ అనుమతి లభించినతమాత్రాన జట్టులోకి ఎంపిక చేస్తామని గట్టి హామీ అయితే అనయా కు లభించలేదు. స్పోర్ట్స్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం వచ్చే ఏడాది మార్చి నుంచి ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో ఆడెందుకు ఆమెకు అనుమతి లభించే అవకాశం ఉంది. అయితే అనయా గురించి చర్చ నడుస్తూనే ఉంది. మరోవైపు మైదానంలో తనను తాను నిరూపించుకోవాలని అనయా కృత నిశ్చయంతో ఉంది. మరి క్రికెట్లో ఆమె ప్రయాణం ఎంత దూరం వెళ్తుందో.. ఈ వివాదాలకు ఆమె ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాల్సి ఉంది.