Vaibhav Suryavanshi : ఇటీవల దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీని కీలక ఆటగాడిగా తీసుకున్నారు. ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ అతడికి ఆ అవకాశం ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సీనియర్ ప్లేయర్లను అతడు ఎలా మేనేజ్ చేయగలడు.. జట్టులో ఎలా ఉండగలడు.. అని అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైభవ్ సూర్య వంశీ అదరగొట్టాడు.
దులీప్ ట్రోఫీలో భాగంగా సూర్య వంశీ నాయకత్వం వహిస్తున్న ఈస్ట్ జోన్ ఫైనల్ వెళ్ళిపోయింది. సెంట్రల్ జోన్ జట్టుతో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ఈస్ట్ జోన్ జట్టు ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. 159 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్ జట్టు 6 వికెట్లు నష్టపోయి సాధించింది. సూర్య వంశీ ఓపెనర్ గా రంగంలోకి దిగాడు. 43 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు.. రెండు సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ ఇషాన్ కిషన్ 41 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు.. ఒక సిక్సర్ ఉంది. అభిమన్యు ఈశ్వరన్ 24.. కుమార కుషాగ్రా 22 పరుగులు చేశారు. షమీ 8* పరుగులు చేసి అదరగొట్టాడు.
ఇక రెండవ ఇన్నింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 45 పరుగులతో మొదలుపెట్టిన సెంట్రల్ జట్టు 158 పరుగులకు కుప్ప కూలింది. ఓపెనర్ అమన్ 41 పరుగులతో ఆకట్టుకున్నాడు. హర్షద్ 25.. హర్ష్ దుబే 24, రింకు 20 పరుగులు చేశాడు. ముఖేష్ కుమార్ 44 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ 56 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అభిజిత్, అనుకూల్ రాయ్, కౌనైన్ ఖురేషి ఒక్కో వికెట్ సాధించారు. తొలి ఇన్నింగ్స్ లో రెండు జట్లు 266 పరుగులకు ఆల్ ఔట్ అయ్యాయి. ఇక సెప్టెంబర్ 6 నుంచి చెన్నైలోని చపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక నార్త్ జోన్.. సౌత్ జోన్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో ఈస్ట్ జోన్ ఫైనల్లో పోటీ పడుతుంది.
ఈ ట్రోఫీ ద్వారా వచ్చిన అవకాశాన్ని సూర్య వంశీ సద్వినియోగం చేసుకున్నాడు. బ్యాటింగ్ చేసే విధానంలో సరికొత్త తీరును ప్రదర్శించాడు. వేగం కాకుండా సమయమనంతో బ్యాటింగ్ చేశాడు. పరుగులు తీసే విధానంలో పూర్తిస్థాయి ప్రొఫెషనలిజం ప్రదర్శించాడు. తద్వారా భవిష్యత్తు లో అత్యుత్తమ ఆటగాడిగా మారడానికి బాటలు వేసుకున్నాడు. అతని ఆటను చూసిన సెలెక్టర్లు భవిష్యత్తు కాలంలో జరగబోయే టోర్నీలలో కచ్చితంగా కీలక అవకాశాలు కల్పిస్తారు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని సోషల్ మీడియా వేదికగా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.