Homeక్రీడలుక్రికెట్‌Shreyas Iyer: హార్దిక్, సూర్య, బుమ్రా ఉన్నా.. ముంబై పొగరును నేలకు దించావు చూడు.. నువ్వు...

Shreyas Iyer: హార్దిక్, సూర్య, బుమ్రా ఉన్నా.. ముంబై పొగరును నేలకు దించావు చూడు.. నువ్వు తోపులకే తోపు అంతే

Shreyas Iyer: గల్లీలో ఎవడైనా ఆడతాడు.. మైదానంలో ఆడిన వాడికే ఒక రేంజ్ ఉంటుంది. అలాగే ముంబై జట్టును ఇతర వేదికల మీద ఓడించడం కష్టమే. కానీ వారి సొంత మైదానం మీద ఓడించడం మరింత కష్టం. కానీ దానిని చేతల్లో చూపించడం ఒకరకంగా సాహసం. ఆ సాహసాన్ని వాస్తవంలో కార్యరూపం దాల్చేలా చేయడం ఒక అద్భుతం. ఆ అద్భుతానికి పేరంటూ ఉంటే.. అది శ్రేయస్ అయ్యర్ అయి ఉంటుంది. అయ్యర్ ఇచ్చిన స్ట్రోక్ కు ఇప్పట్లో […]

Shreyas Iyer: గల్లీలో ఎవడైనా ఆడతాడు.. మైదానంలో ఆడిన వాడికే ఒక రేంజ్ ఉంటుంది. అలాగే ముంబై జట్టును ఇతర వేదికల మీద ఓడించడం కష్టమే. కానీ వారి సొంత మైదానం మీద ఓడించడం మరింత కష్టం. కానీ దానిని చేతల్లో చూపించడం ఒకరకంగా సాహసం. ఆ సాహసాన్ని వాస్తవంలో కార్యరూపం దాల్చేలా చేయడం ఒక అద్భుతం. ఆ అద్భుతానికి పేరంటూ ఉంటే.. అది శ్రేయస్ అయ్యర్ అయి ఉంటుంది. అయ్యర్ ఇచ్చిన స్ట్రోక్ కు ఇప్పట్లో ముంబై జట్టు కోలుకోలేదు.

గురువారం సాధించిన విజయం మాత్రమే కాదు.. ఏకంగా వాంఖడే స్టేడియంలోనే సరికొత్త బెంచ్ మార్కు సృష్టించాడు అయ్యర్. ఈ మైదానం మీద ముంబై జట్టుతో తలపడిన పంజాబ్ జట్టు.. ఏకంగా ఆరు విజయాలు నమోదు చేసింది. తద్వారా చెన్నై, బెంగళూరు రికార్డును బద్దలు కొట్టింది. చెన్నై జట్టు ఐదు విజయాలు, బెంగళూరు జట్టు ఐదు విజయాలతో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మీద అయ్యర్ 35 బంతుల్లో 66 పరుగులు చేశాడు.

దీనికంటే ముందు చెన్నై మీద 29 బంతుల్లో 50, హైదరాబాద్ మీద 33 బంతుల్లో 69* పరుగులు చేశాడు. ఒక సారధిగా వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి.. జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. అలాగని అతడికి ఏమి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు రాలేదు. అయినప్పటికీ జట్టు విజయంలోనే తన ఆనందాన్ని వెతుకున్నాడు. అందువల్లే మూల స్థంభంలాగా నిలబడి స్థిరమైన ఇన్నింగ్స్ ఆడాడు.

పంజాబ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ముంబై జట్టు సారథి హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుసగా నాలుగు మ్యాచ్లో ఓడిపోవడాన్ని అతడు భారంగా చెప్పాడు. చెప్పడానికి ఏమీ లేదని.. తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం కావడం లేదని.. గట్టిగా విఫలమవుతున్నామా లేదా ఆటగాళ్ల వ్యక్తిగత లోపాలా.. ప్రణాళికలు అమలు కావడం లేదా.. ఇన్ని ప్రశ్నలు మదిలో మిగులుతున్నాయని హార్దిక్ పాండ్యా అన్నాడంటే.. అయ్యర్ ఏ స్థాయిలో ప్రతాపం చూపించాడో అర్థం చేసుకోవచ్చు. ముంబై జట్టు మొదట్లో పరుగులు భారీగా తీస్తున్నప్పుడు అయ్యర్ మానసిక ధైర్యాన్ని కోల్పోలేదు. బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించాడు.

వికెట్ పడిన వెంటనే ఒత్తిడి పెంచాడు. ఫలితంగా పరుగుల ప్రవాహాన్ని తగ్గించాడు. తద్వారా తక్కువ లక్ష్యం ఉండేలా చేసుకున్నాడు. పంజాబ్ ఓపెనర్లు భీకరంగా ఆడుతున్నారు. ఒకవేళ వారిలో ఎవరైనా విఫలమైనా కూపర్ కన్నోలి ఉన్నాడు. అతడు విఫలమైనా సరే తను ఉన్నాడు. ఇదిగో ఈ ధైర్యమే పంజాబ్ జట్టును షేర్ లాగా నిలబెడుతోంది. అయ్యర్ స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper