Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశే తుఫాన్ అనుకుంటే.. అతడి తమ్ముడు సునామి.. వైరల్ వీడియో

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశే తుఫాన్ అనుకుంటే.. అతడి తమ్ముడు సునామి.. వైరల్ వీడియో

Vaibhav Suryavanshi: జాతీయ క్రికెట్ జట్టుకు వైభవ్ సూర్య వంశీ ఎంపికయ్యాడు. ఇటీవలి ఐపిఎల్ లో తిరుగులేని స్థాయిలో ఆడిన తర్వాత అతడు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. అతడి గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఐర్లాండ్ టూర్ లో గనుక అతడు అదరగొడితే ఇక తిరుగు ఉండదు. సూర్య వంశీ గురించి ఇప్పటికే అనేక కథనాలు మీడియాలో వచ్చాయి. సూర్య వంశీ వంతు అయిపోయింది. ఇప్పుడు అతడి తమ్ముడు మొదలుపెట్టాడు. […]

Vaibhav Suryavanshi: జాతీయ క్రికెట్ జట్టుకు వైభవ్ సూర్య వంశీ ఎంపికయ్యాడు. ఇటీవలి ఐపిఎల్ లో తిరుగులేని స్థాయిలో ఆడిన తర్వాత అతడు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. అతడి గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఐర్లాండ్ టూర్ లో గనుక అతడు అదరగొడితే ఇక తిరుగు ఉండదు. సూర్య వంశీ గురించి ఇప్పటికే అనేక కథనాలు మీడియాలో వచ్చాయి.

సూర్య వంశీ వంతు అయిపోయింది. ఇప్పుడు అతడి తమ్ముడు మొదలుపెట్టాడు. సూర్య వంశీ కి తమ్ముడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలో ఉంది.. భారత క్రికెట్లో సంచలన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు వైభవ్ సూర్య వంశీ. అతడి తమ్ముడు కూడా క్రికెటర్ కావాలని అనుకుంటున్నాడు. అంతేకాదు భవిష్యత్తులో తన అన్నను బీట్ చేస్తానని చెబుతున్నాడు.

సూర్య వంశీ తమ్ముడు పేరు ఆశీర్వాద్ సూర్య వంశీ. ఇతడు బీహార్లో చదువుతున్నాడు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో అతడు పాల్గొన్నాడు.”భవిష్యత్తు కాలంలో క్రికెట్ ఆడతావా.. మీ అన్నను నువ్వు అధిగమిస్తావా.. భారీగా పరుగులు చేయగలుగుతావా.. ఐపీఎల్ లో ఆడతావా” అని యాంకర్ ప్రశ్నలు అడిగితే.. అతడు అన్నింటికీ సమాధానం అవును అని చెప్పాడు.. “ఏది అడిగినా సరే అతడు అవును అంటున్నాడని.. ఇతడు కూడా సూర్య వంశీ లాగానే ఆడతాడేమోనని” సోషల్ మీడియాలో కామెంట్ లో వినిపిస్తున్నాయి.

ఆశీర్వాద్ కూడా దృఢంగా ఉన్నాడు.. సూర్య వంశీ మాదిరిగానే బలిష్టంగా కనిపిస్తున్నాడు. సూర్య వంశీ ఇప్పటికే తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ అనేకం ఆడాడు. ఆశీర్వాద్ క్రికెట్లోకి వస్తే సునామి తరహా లోనే బ్యాటింగ్ చేస్తాడేమో.. అన్నను మించిపోయి అదరగొడతాడేమోనని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే ఆశీర్వాద్ మాట్లాడుతుంటే భలే అందంగా ఉన్నాడు. ప్రతి ప్రశ్నకు అతడు అవును అని సమాధానం చెబుతూ.. తనదైన హావభావాన్ని ప్రదర్శించాడు. అతడి క్యూట్ మాటలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అతడు భవిష్యత్తు కాలంలో మంచి పేరు తెచ్చుకుంటాడని పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper