Homeక్రీడలుక్రికెట్‌Jasprit Bumrah: ఐదు మ్యాచ్ ల్లో ఒక్క వికెట్ లేదు.. మనం చూస్తోంది నిజంగా బుమ్రా...

Jasprit Bumrah: ఐదు మ్యాచ్ ల్లో ఒక్క వికెట్ లేదు.. మనం చూస్తోంది నిజంగా బుమ్రా నేనా

Jasprit Bumrah: సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పౌర్ణమి రోజు చందమామ గొప్పగా వెలిగిపోతాడు.. నీరు పల్లానికి ప్రవహిస్తూ ఉంటుంది.. వీటిని యూనివర్సల్ ట్రూత్ లు అని పిలుస్తుంటారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో మారవు. మారే అవకాశం కూడా లేదు. అలాగే బుమ్రా బంతి అందుకొని బౌలింగ్ చేస్తుంటే వికెట్ పడుతుంది. ప్రత్యర్థి ఆటగాడు పరుగులు తీయకుండా అడ్డుకట్టపడుతుంది.. ఒక జట్టు మీద కాదు.. క్రికెట్ ఆడే అన్ని జట్ల మీద అతడి రికార్డు అద్భుతం.. అనితర సాధ్యం.

ఈ కాలంలో క్రికెట్ ఆడుతున్న బ్యాటర్ లందరికీ సింహ స్వప్నం బుమ్రా. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అంతటి విరాట్ కోహ్లీ కూడా బుమ్రా బౌలింగ్ గురించి గొప్పగా వ్యాఖ్యానించాడు. అతడు ఈ కాలంలో లభించిన గొప్ప వరమని.. ప్రతి తరానికి ఇటువంటి ఆటగాడు కచ్చితంగా ఉంటాడని కొనియాడాడు.

అంతటి స్థాయి ఉన్న బుమ్రా విఫలమవుతున్నాడు. గొప్పగా ఆడాల్సిన చోట తడబడుతున్నాడు. బంతితో మాయాజాలం చేయాల్సిన సందర్భంలో వికెట్లు కూడా తీయలేకపోతున్నాడు. పరుగులను నియంత్రించాల్సిన చోట ధారాళంగా ఇచ్చేస్తున్నాడు. నిజంగా బుమ్రా కు ఏమైంది.. ఇలా ఎందుకు బౌలింగ్ చేస్తున్నాడు.. యార్కర్ల రారాజు ఇలా ఎందుకు తేలిపోతున్నాడు.. ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్లలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. కనీసం పరుగులు కూడా ఆపలేదు.

గురువారం నాటి మ్యాచ్లో ముంబై జట్టు 195 పరుగులు చేసినప్పటికీ ఓడిపోయింది. ఈ ఓటమికి ఒక రకంగా యార్కర్ల కింగ్ కూడా కారణమే. నాలుగు ఓవర్లలో ఏకంగా 41 పరుగులు ఇచ్చాడు. కట్టుదిట్టమైన బంతులు వేయలేకపోయాడు. పైగా అతనిలో అసహనం కనిపించింది. బంతిమీద నియంత్రణ కోల్పోయి.. పదేపదే పుల్లర్ లెంత్ లు వేశాడు. దీంతో పంజాబ్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పరుగులను వేగంగా తీశారు. ఇలాంటి బంతులు బుమ్రా ఎప్పుడూ వేయలేదు. ఒకవేళ పరుగులు ఇచ్చినా సరే వికెట్లు తీసేవాడు. అంతలా బౌలింగ్ వేసే బుమ్రా ఇలా తేలిపోవడాన్ని అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

“అతడు బౌలింగ్ వేస్తుంటే నిప్పు కణాల మాదిరిగా బంతులు దూసుకు వచ్చేవి. కానీ ఆ లయ లేదు. దూకుడు కనిపించడం లేదు. అసలు బంతి మీద ఏ మాత్రం పట్టులేదు. బ్యాటర్ ఏమాత్రం ఇబ్బంది పడడం లేదు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే బుమ్రా తన లయను కోల్పోయాడని అర్థమవుతోంది. అతడు తన లోపాలను సవరించుకోవాల్సిందే. లేకపోతే ఇలాంటి అధమ స్థాయి బౌలింగ్ చూడడం సాధ్యం కావడం లేదని” ముంబై అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular