Homeక్రీడలుTeam India India vs Pakistan : పాకిస్తాన్ మీద గెలిచిన టీమ్ ఇండియాకు.. షాక్...

Team India India vs Pakistan : పాకిస్తాన్ మీద గెలిచిన టీమ్ ఇండియాకు.. షాక్ ..

Team India India vs Pakistan : టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా కొలంబోలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మీద అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయం ద్వారా టీమ్ ఇండియా సూపర్ 8 లోకి వెళ్లిపోయింది. లీగ్ సమరం దాదాపుగా ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో.. సూపర్ 8 కు వెళ్లే జట్లు ఏవో ఒక స్పష్టత వచ్చింది.

టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సూపర్ 8 దశలో తలపడబోయే జట్ల మీద ఒక క్లారిటీ వచ్చింది. భారత్ ఇప్పటికే సూపర్ 8 దశకు అర్హత సాధించింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూపులో ఉండే అవకాశం ఉంది. మరొక స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే పోటీ పడతాయి. ఒకవేళ ఆస్ట్రేలియా ఈ గ్రూపులోకి వస్తే పోటీ కఠినంగా మారే అవకాశం ఉంది. భారత్ ఫిబ్రవరి 22న సౌత్ ఆఫ్రికా తో తలపడుతుంది. ఫిబ్రవరి 26న ఆస్ట్రేలియా లేదా జింబాబ్వేతో పోటీ పడుతుంది. మార్చి 1న వెస్టిండీస్ తో భారత్ ఆడుతుంది.

ఇక గ్రూప్ 2 లో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలపడే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో భీకరమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. గత ఏడాది జరిగిన టి20 సిరీస్లో టీమిండియా దక్షిణాఫ్రికా మీద గెలిచినప్పటికీ.. ఆ జట్టు భారత బృందానికి తీవ్ర పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికా మీద గెలవాలంటే తీవ్రంగా ప్రయత్నించాలి. ఆస్ట్రేలియా ఒకవేళ సూపర్ 8 లోకి వస్తే ఫిబ్రవరి 26న.. కంగారు జట్టుతో టీమిండియా పోటీ పడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్లు ముగిసిన తర్వాత వెస్టిండీస్ జట్టుతో భారత జట్టు తలపడాల్సి ఉంటుంది

ఇలా ఏ రకంగా చూసినా టీమిడియాకు సూపర్ 8 దశ అనేది అత్యంత కఠినంగా ఉంది. సౌత్ ఆఫ్రికా జోరు మీద ఉంది. ఆస్ట్రేలియా జింబాబ్వే చేతిలో ఓడిపోయినంత మాత్రాన ఆ జట్టును తక్కువ చేసి చూడడానికి లేదు. వెస్టిండీస్ కూడా బీభత్సంగానే ఆడుతోంది. ఆ జట్టులో బౌలర్లతోపాటు.. బ్యాటర్లు కూడా సత్తా చూపిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ 8 లో టీమిండియా అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది.

అమెరికాతో.. నమిబియాతో జరిగిన మ్యాచ్లలో టీమిండియా కాస్త ఇబ్బంది పడింది. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో లోపాలను సవరించుకొని.. టీమిండియా బలంగా సూపర్ 8 లో ఆడాల్సి ఉంటుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular