Homeక్రీడలుక్రికెట్‌Mumbai Indians: ముంబై ముందుగానే గుడ్ బై..వరల్డ్ కప్ విన్నర్లు.. ఫాస్ట్ బౌలర్లు ఉన్నా.. గుండు...

Mumbai Indians: ముంబై ముందుగానే గుడ్ బై..వరల్డ్ కప్ విన్నర్లు.. ఫాస్ట్ బౌలర్లు ఉన్నా.. గుండు సున్నా

Mumbai Indians: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్.. అంతేకాదు ఆబ్జెక్టులో 2024 టీమిండియా టి20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్నాడు. 2026లో టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియాకు అందించిన సారథి ఉన్నాడు. 2023లో వన్డే వరల్డ్ కప్ రన్నరప్ కెప్టెన్ ఆజతిలో ఉన్నాడు. గ్రేటెస్ట్ బౌలర్ అఫ్ ది జనరేషన్ ఉన్నాడు.. బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అందులో ఉన్నాడు.. అన్నిటికి మించి స్టార్ బాయ్ తిలక్ వర్మ ఆ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. […]

Mumbai Indians: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్.. అంతేకాదు ఆబ్జెక్టులో 2024 టీమిండియా టి20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్నాడు. 2026లో టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియాకు అందించిన సారథి ఉన్నాడు. 2023లో వన్డే వరల్డ్ కప్ రన్నరప్ కెప్టెన్ ఆజతిలో ఉన్నాడు. గ్రేటెస్ట్ బౌలర్ అఫ్ ది జనరేషన్ ఉన్నాడు.. బెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అందులో ఉన్నాడు.. అన్నిటికి మించి స్టార్ బాయ్ తిలక్ వర్మ ఆ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు.

ఇంతమంది ఉన్నప్పటికీ.. ఈ స్థాయిలో ఘనతలు సాధించిన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఆ జట్టు తేలిపోయింది. ఐపీఎల్ 2026 సీజన్ లో ముందుగానే ఇంటికి వెళ్ళిపోయింది. చిరకాల ప్రత్యర్థి చెన్నై జట్టు చేతులో ఓడిపోయి పరువు తీసుకుంది.. బ్యాటింగ్ లో విఫలమైంది. బౌలింగ్లో ఆకట్టుకోలేకపోయింది.. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. అసలు ఇలా ముంబై జట్టు ఓడిపోతుందని కనీసం ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు కూడా ఊహించి ఉండరు.

2024లో ముంబై జట్టుకు సారధిగా హార్దిక్ పాండ్యా వచ్చాడు. అతని నాయకత్వంలో ఆ సీజన్ లో ముంబై జట్టు చివరి స్థానానికి చేరుకుంది. 2025లో మాత్రం కొంచెం బెటర్ గా ఆడింది. టాప్ ఫోర్ లో నిలిచింది. కానీ ఈసారి దారుణమైన ఆట తీరు కొనసాగించింది. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ముంబై జట్టు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

జట్టు ఓడిపోయిన అనేక సందర్భాలలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేసేవాడు. ఆత్మ పరిశీలన చేసుకుంటామని చెప్పేవాడు. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడినట్టు కనిపించడం లేదు.. పైగా ప్లేయర్ల కోసం ఇటీవల మేనేజ్మెంట్ రిక్రియేషన్ ఈవెంట్ నిర్వహించింది. కనీసం దాని ద్వారానైనా ప్లేయర్లు ఒత్తిడిని జయించి అద్భుతంగా ఆడతారని అనుకుంది. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. గొప్ప గొప్ప ప్లేయర్లు ఇలా దారుణంగా ఆడుతున్న నేపథ్యంలో ముంబై జట్టు మేనేజ్మెంట్ పై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper