Homeక్రీడలుక్రికెట్‌Babar Azam: ఆరంభ శూరత్వం.. ఈ పాక్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించడం బెటర్

Babar Azam: ఆరంభ శూరత్వం.. ఈ పాక్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించడం బెటర్

Babar Azam: పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ ఆట తీరుపై మరోసారి విమర్శలు మొదలయ్యాయి. క్రీజులోకి వచ్చిన తర్వాత మంచి ఆరంభాలు చేస్తున్నప్పటికీ.. వాటిని భారీ స్కోరుగా మలచలేక పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బాబర్.. కీలకమైన సమయాలలో పెద్ద ఇన్నింగ్స్ లు ఆడ లేకపోవడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. మంచి ఆరంభాలే.. వన్డే ట్రై సిరీస్ లో బాబర్ ఆడుతున్న తీరు అతని ఫామ్ పై […]

Babar Azam: పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజామ్ ఆట తీరుపై మరోసారి విమర్శలు మొదలయ్యాయి. క్రీజులోకి వచ్చిన తర్వాత మంచి ఆరంభాలు చేస్తున్నప్పటికీ.. వాటిని భారీ స్కోరుగా మలచలేక పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బాబర్.. కీలకమైన సమయాలలో పెద్ద ఇన్నింగ్స్ లు ఆడ లేకపోవడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది.

మంచి ఆరంభాలే..

వన్డే ట్రై సిరీస్ లో బాబర్ ఆడుతున్న తీరు అతని ఫామ్ పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. శ్రీలంక జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో అతడు 45 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 34 పరుగులకే పరిమితమయ్యాడు. రెండు మ్యాచ్ లలోనూ అతడు నిలబడే ప్రయత్నం చేసినప్పటికీ.. భారీ పరుగులుగా మలచలేకపోయాడు. బాబర్ లాంటి అనుభవం ఉన్న ఆటగాడు జట్టుకు కీలకమైన సమయంలో భారీగా పరుగులు చేయాలని అభిమానులు ఆశిస్తుంటారు. అయితే వారి అంచనాలను బాబర్ అందుకోలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అతడు సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోవడం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి…

మూడు బలహీనతలు

బాబర్ ఆట తీరు పట్ల పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాబర్ మూడు రకాల బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నాడని అతడు అభిప్రాయపడ్డాడు. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో బాబర్ సరైన స్థాయిలో ఫుట్ వర్క్ చూపించడం లేదని.. బంతిని అంచనా వేయడంలో విఫలమవుతున్నాడు. లోపలికి తీసుకువచ్చే పాస్ట్ బంతులను ఎదుర్కోలేకపోతున్నాడు. బాబర్ బలహీనతలను గమనించి పేస్ బౌలర్లు అత్యంత వేగవంతమైన బంతులు వేస్తున్నారు. ఇక షార్ట్ బాల్స్.. బౌన్సర్లను బాబర్ ఎదుర్కోలేకపోతున్నాడు. వేగంగా శరీర వైపు దూసుకొచ్చే బంతులను అంచనా వేయడంలో అతడు దారుణంగా విఫలమవుతున్నాడు.

ఒక టాప్ బ్యాటర్ లో ఇన్ని బలహీనతలు కనిపిస్తే.. ప్రత్యర్థి బౌలర్లు వాటిని లక్ష్యంగా చేసుకుంటారు. సరిగా ఇదే విషయాన్ని తన్వీర్ అహ్మద్ ప్రస్తావించాడు. తనలోపాలను గుర్తించి.. సరిదిద్దుకోవాలని బాబర్ కు తన్వీర్ సూచిస్తున్నాడు.

బాబర్ కు ప్రతిభవుంది. క్లాసిక్ షాట్లు ఆడటంలో.. ఇన్నింగ్స్ నిర్మించడంలో అతడికి మంచి సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం ఎదురవుతున్న సవాలు.. క్రీజు లో స్థిరపడిన తర్వాత అతడు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్పిన్నర్ లను ఎదుర్కొనే సమయంలో సరైన ఫుట్ వర్క్ చూపించాలి. పేస్ బౌలర్ల బౌలింగ్లో దూకుడు చూపించాలి. ఈ రెండు లోపాలు అతడి ఆట తీరును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

పాకిస్తాన్ జట్టుకు బాబర్ వంటి అనుభవం ఉన్న ఆటగాడు ఫామ్ లో ఉండడం అత్యంత అవసరం. అతడు కేవలం 30, 40 పరుగుల వద్ద ఆగిపోవడం ఆ జట్టు అభిమానులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. వచ్చిన ఆరంభాలను అర్థ సెంచరీలు లేదా సెంచరీలుగా అతడు మార్చగలిగితే జట్టుకు విశేషమైన ప్రయోజనం లభిస్తుంది. అతడు ఇలాగే ఆడితే మాత్రం.. రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమం అని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper