PBKS Vs KKR IPL 2025: ఏడాది గడిచిందో లేదో.. ఈ మధ్యలోనే వారిద్దరికీ తేడాలు వచ్చేసాయి. విభేదాలు మొదలయ్యాయి. చివరికి విడాకులు మంజూరయ్యాయి. ఇప్పుడు ఎవరి దారి వారిది.. ధనశ్రీ తన పాటలతో బిజీ అయిపోయింది. చాహల్ తన ఆటతో విరామం లేకుండా ఉన్నాడు. చాహల్ ఇటీవల టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ తో దుబాయ్ వేదికగా ఆడినప్పుడు.. ఆ మ్యాచ్ చూసేందుకు హాజరయ్యాడు. కాకపోతే ఒంటరిగా కాదు.. అతని వెంట ఆర్జే మహ్వేష్ కూడా ఉంది.. దీంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని ప్రపంచం మొత్తానికి తెలిసింది. అయితే ఈ విషయాన్ని చాహల్ దాచిపెట్టాలని అనుకోలేదు..
ఆర్జే మహ్వేష్ కూడా గోప్యత పాటించలేదు. ఇద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు. ఇక ఇటీవల చాహల్ కు సోషల్ మీడియా వేదికగా ఆర్జే మహ్వేష్ మద్దతు ప్రకటించింది . నీ వెనుక మేమున్నామంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేయగా.. మీలాంటి బంగారు మనుషులు ఉంటే ఏదైనా సాధ్యమని అతడు వ్యాఖ్యానించాడు. ఆమె ప్రోత్సాహమో.. ఇంకోటో తెలియదు గాని.. మొత్తానికి చాహల్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. 112 పరుగుల టార్గెట్ చేజ్ చేస్తుందనుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.
Also Read: శ్రేయస్ అయ్యర్ ను షారుక్ ఎందుకు వదిలేశాడో.. ప్రీతి జింటాకు తెలిసే ఉంటుంది
ఆర్జే మహ్వేష్ ఆనందం.. ధన శ్రీ వర్మ నిర్వేదం
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా చాహల్ గురించి సోషల్ మీడియాలో, మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. నాలుగు వికెట్లు తీసినందుకు చాహల్ కు పంజాబ్ జట్టు ఓనర్ ప్రీతి జింటా హగ్ ఇచ్చింది. అతడిని దగ్గరికి తీసుకొని అభినందించింది. ధన శ్రీతో విడాకులు తీసుకున్న తర్వాత చాహల్ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. అందువల్లే ఇన్ని వికెట్లు సాధించాడని అతని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. “చాహల్ తనదైన రోజు అద్భుతం చేశాడు. బలమైన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు చుక్కలు చూపించాడు. చాహల్ సాధించిన ఈ ఘనతను ఆర్జే మహ్వేష్ గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుంది. అందులో అనుమానం లేదు. ఇక ధన శ్రీ వర్మ నిర్వేదంలో ఉంటుంది. ఇందుకు కారణం వెతుక్కోవలసిన అవసరం లేదు. కొన్ని అలా జరిగిపోతుంటాయి. మనం వాటిని చూస్తూ ఉండాల్సింది అంతే. అంతకుమించి ఏమీ లేదని” సోషల్ మీడియాలో ఐపిఎల్ ఫ్యాన్స్ చాహల్ ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:నరాలు కట్ అయ్యాయి.. ఏమన్నా మ్యాచ్ నా..”పంజా” బ్ దెబ్బకు కోల్ “కథ” ముగిసింది